HIT 3 Day 1 Box Office: నాని కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ .. హిట్ 3కి రికార్డ్ ఓపెనింగ్స్, ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ప్రశాంతి త్రిపిర్నేనిని పిలుస్తారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. వరుస విజయాలతో ఆమె దూకుడు మీదున్నారు. తాజాగా వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన చిత్రం హిట్ 3. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు హిట్ 3 వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా హిట్ 3 సినిమాను తెరకెక్కించారు. దేశంలోని టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లతో పాటు హిట్ ఫ్రాంఛైజీపై ఉన్న బ్రాండ్‌తో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయలను హిట్ 3 సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలిరోజు తెలుగు వెర్షన్‌కు 87.98 శాతం .. తమిళంలో 42.60 శాతం.. కన్నడంలో 22.24 శాతం .. హిందీ వెర్షన్‌కు 30.06 శాతం, మలయాళం వెర్షన్‌కు 31.49 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. దాంతో హిట్ 3కి భారీ ఓపెనింగ్స్ సాధ్యమయ్యాయి.
తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
మార్నింగ్ షో నుంచే హిట్ 3 సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా తెలుగులో 17.25 కోట్ల నెట్, తమిళంలో 35 లక్షల రూపాయల నెట్, కర్ణాటకలో 5 లక్షల నెట్, హిందీలో 25 లక్షల నెట్, మలయాళంలో లక్ష రూపాయల చొప్పున మొత్తంగా ఇండియా వైడ్‌గా రూ.18 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. ఓవర్సీస్ వసూళ్లు కూడా కలిపితే ఈ మొత్తం 30 కోట్ల పైమాటేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దసరా చిత్రానికి గాను నాని తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును హిట్ 3 నాని బద్ధలు కొట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ టాక్. మరి లాంగ్ రన్‌లో నేచురల్ స్టార్ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











