HIT 3 Day 1 Collections: నాని సరికొత్త బాక్సాఫీస్ చరిత్ర .. హిట్ 3 మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినిమా పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాత ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించిన చిత్రం హిట్ 3. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు నటించారు.
హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఏ మేరకు? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
హిట్ సినిమాకు వివిధ ప్రాంతాల్లో షూట్ చేయడం, టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నాని కెరీర్‌లోనే అత్యధికంగా బిజినెస్ జరిగిందనేది తాజా సమాచారం. ఈ సినిమా నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసింది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
హిట్ 3 సినిమా కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు తొలి రోజు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది.
తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
హిట్ 3 సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో రన్ మొదలుపెట్టింది. ఈ సినిమా నైజాంలో 12 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 12 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా 45 నుంచి 50 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
నాని కెరీర్‌లో సరికొత్త చరిత్ర
హిట్ 3 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దసరా చిత్రం నేచురల్ స్టార్‌కు అత్యుత్తమ బాక్సాఫీస్ రికార్డును ఇచ్చింది. తాజా చిత్రం ఓవర్సీస్‌లోను, తెలుగు రాష్ట్రాల్లోను భారీ ఓపెనింగ్స్ సాధించడంతో హీరో నాని పేరుపై రికార్డు ఓపెనింగ్స్ నమోదు కావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











