HIT 3 Day 2 Box Office : సరిపోదా శనివారం ఔట్ .. వసూళ్లలో నాని రేర్ ఫీట్ , రెండో రోజు ఎన్ని కోట్లంటే?
ట్రేడ్ పండితులు ఊహించినట్లుగానే హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. తొలిరోజే రికార్డు ఓపెనింగ్స్‌తో చరిత్ర సృష్టించిన నాని ఈ వీకెండ్‌లోగా ఒడ్డున పడిపోవాలని చూస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు హిట్ 3 వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా హిట్ 3 సినిమాను తెరకెక్కించారు. దేశంలోని టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లతో పాటు హిట్ ఫ్రాంఛైజీపై ఉన్న బ్రాండ్‌తో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయలను హిట్ 3 సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా హిట్ 3పై హైప్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
నాని సినిమాకు తొలిరోజు ఇండియా వైడ్ రూ. 26 కోట్ల గ్రాస్ , ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల నెట్, 22.5 కోట్ల గ్రాస్ సాధించింది హిట్ . కేరళ, తమిళనాడు, కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో కలిపి 4 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో వచ్చిన రూ.17 కోట్లతో కలిపి హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
హిట్ 3 రెండో రోజు వసూళ్లు ఎంతంటే?
రెండో రోజు హిట్ 3 తెలుగు వెర్షన్‌కు ఓవరాల్‌గా 52.27 శాతం .. తమిళంలో 24.41 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. శుక్రవారం నాని సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైడ్ రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఏపీ , తెలంగాణ కలిపి రూ.9.7 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 30 లక్షల నెట్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హిట్ 3 కేవలం రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.43 కోట్లు, రెండో రోజు రూ.19 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఆదివారం వీకెండ్ కావడంతో పాటు వేసవి సెలవుల నేపథ్యంలో నాని సేఫ్ జోన్‌లో అడుగుపెడతాని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
నాని రేర్ రికార్డ్ :
హిట్ 3 రెండో రోజు వసూళ్లతో నాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆయన నటించిన గత చిత్రం సరిపోదా శనివారం రెండో రోజు రూ.5.85 కోట్లు వసూలు చేయగా హిట్ 3 రెండో రోజు రూ.10 కోట్లకు పైగా రాబట్టింది. రెండో రోజు వసూళ్లతో కలిపి హిట్ ఫ్రాంఛైజీలోని హిట్ 1, హిట్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను నాని అధిగమించారు. విశ్వక్ సేన్ హిట్ 1 లాంగ్ రన్‌లో 8 కోట్లు వసూలు చేయగా.. అడవి శేష్ హిట్ 2 రూ.25 కోట్లు రాబట్టింది. ఈ రెండు చిత్రాలు కలిపి వసూలు చేసిన మొత్తాన్ని నాని కేవలం ఓపెనింగ్స్‌తోనే బద్ధలు కొట్టారు.


Click it and Unblock the Notifications











