HIT 3 Day 3 Box Office : నాని కలెక్షన్ల జాతర .. మహేశ్‌తో కలిసి మాస్ రికార్డ్ .. హిట్ 3 ఎన్ని కోట్లంటే?
గత కొద్దిరోజులుగా కళ తప్పిన బాక్సాఫీస్‌కు నేచురల్ స్టార్ నాని కొత్త శోభను తీసుకొచ్చారు. ఆయన తాజా చిత్రం హిట్ 3 అన్ని ఏరియాలలో వసూళ్ల వర్షం కురిపిస్తూ సందడి వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో వసూళ్ల జాతరతో త్వరగా సేఫ్ జోన్‌లోకి రావాలని చూస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు హిట్ 3 వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్
ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా హిట్ 3 సినిమాను తెరకెక్కించారు. దేశంలోని టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. టీజర్, ట్రైలర్లతో పాటు హిట్ ఫ్రాంఛైజీపై ఉన్న బ్రాండ్‌తో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయలను హిట్ 3 సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
థియేట్రికల్ రైట్స్ బిజినెస్
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా హిట్ 3పై హైప్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఇండియాలో రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్రా, తెలంగాణల్లో తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్ వచ్చింది. మొత్తంగా రెండు రోజుల వరకు భారతదేశంలో హిట్ 3కి నికరంగా రూ.31 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?
తెలుగు హీరోలలో నానికి ఓవర్సీస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గత చిత్రాలు అలవోకగా 1 మిలియన్ దాటేశాయి. తాజాగా హిట్ 3 ... 1.5 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.13 కోట్లు) సాధించాడు. తద్వారా ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ సాధించిన నాని 11వ సినిమాగా హిట్ 3 నిలిచి సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఓవర్సీస్‌లో అత్యధికంగా 1 మిలియన్ల డాలర్ల సినిమాలు సాధించిన రికార్డు నిన్నటి వరకు మహేశ్ పేరిట ఉండేది. ఓవర్సీస్‌లో హిట్ 3కి తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. రెండు రోజుల వరకు ఓవర్సీస్‌లో నాని చిత్రానికి రూ.16 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
హిట్ 3 మూడో రోజు వసూళ్లు ఎంతంటే?
మూడో రోజు హిట్ 3 తెలుగు వెర్షన్‌కు ఓవరాల్‌గా 52.85 శాతం .. తమిళంలో 38.56 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. మూడో రోజైన శనివారం నాని సినిమా ఇండియా వైడ్ రూ.10.25 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఏపీ , తెలంగాణ కలిపి రూ.9.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 75 లక్షల రూపాయల నెట్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండ్రోజుల్లోనే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్ల వసూళ్లు సాధంచిందని చిత్ర నిర్మాణ సంస్ధ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ప్రకటించింది. తాజాగా మూడో రోజు వసూళ్లతో కలిపి ఈ మొత్తం రూ.75 కోట్లు దాటనుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంది. ఆదివారం వీకెండ్ కావడంతో సినిమాకు ప్లస్‌గా మారుతుందని నాలుగు రోజుల్లోనే హిట్ 3 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











