HIT 3 Day 3 Collections: హిట్ 3 కలెక్షన్ల సంచలనం.. నాని మూవీకి 3 రోజు ఎన్ని కోట్లంటే?
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా గతంలో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మూడో సీక్వెల్‌గా వచ్చింది. మే 1వ తేదీన రిలీజైన ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
60 కోట్ల బడ్జెట్‌తో
హిట్ 3 చిత్రంలో సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, కోమలి ప్రసాద్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమాలో టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడం, అలాగే కశ్మీర్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో రిచ్‌గా షూట్ చేయడంతో బడ్జెట్ భారీగా అయింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
హిట్ 3 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాం, సీడెడ్, ఆంధ్రా కలిపి 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసింది అని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. దాంతో ఈ సినిమా 50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.
2 రోజుల్లో ఇండియా కలెక్షన్లు
నాని నటించిన హిట్ 3 సినిమా గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. నైజాంలో 8 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. కర్ణాటకలో 3 కోట్ల రూపాయలు, ఇతర భాషల్లో 45 లక్షలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.
2 రోజుల్లో వరల్డ్ వైడ్ వసూళ్లు
ఇక హిట్ 3 కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయలు, రెండో రోజు 19 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండు రోజుల్లో ఈ సినిమా 62 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలో 45 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 17 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో నాని కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో తన సినిమాల పేరిటి ఉన్న 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను హిట్ 3 సినిమాతో అధిగమించాడు.
మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హిట్ 3 మూవీ 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మార్నింగ్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 55 శాతం, సెకండ్ షోకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక ఈ సినిమా ఇండియాలో 8 కోట్లు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా 3వ రోజు మరో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











