HIT 3 Day 4 Box Office : నానికి సండే స్ట్రోక్ .. హిట్ 3కి షాకింగ్ కలెక్షన్స్, నాలుగో రోజు ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని తాజా యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో నాని విశ్వరూపం చూపించాడు. టగ్ ఆఫ్ వార్‌లో పైచేయి సాధించిన నాని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో తన చూపిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

HIT 3 Movie Day 4 Box Office Collections Worldwide nani film s earnings drop in first sunday

హిట్ 3 సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా, సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు హిట్ 3 వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

భారతీయ చిత్ర పరిశ్రమలోని టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేయడంతో బడ్జెట్ పెరిగిపోయింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ టాక్. టీజర్, ట్రైలర్లతో పాటు హిట్ ఫ్రాంఛైజీపై ఉన్న బ్రాండ్‌తో ఈ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయలను హిట్ 3 సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

థియేట్రికల్ రైట్స్ బిజినెస్

ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా హిట్ 3పై హైప్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్రా, తెలంగాణల్లో తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్ చొప్పున మొత్తం 40.2 కోట్ల రూపాయలు రాబట్టింది హిట్. మూడు రోజుల వరకు తమిళంలో 96 లక్షల రూపాయలు, కన్నడంలో 14 లక్షల రూపాయలు, హిందీలో 70 లక్షల రూపాయలు, మలయాళంలో 31 లక్షల రూపాయలు ఆర్జించింది నాని మూవీ. ఓవరాల్‌గా మూడు రోజుల వరకు ఇండియాలో హిట్ 3కి నికరంగా రూ.42 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ వాల్ పోస్టర్ సినిమా ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది.

ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?

ఓవర్సీస్‌లో నాని ఫ్యాస్ బేస్ దృష్ట్యా హిట్ 3కి రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 1.5 మిలియన్లు సాధించిన ఈ సినిమాను నార్త్ అమెరికాలో మరింత ప్రమోట్ చేసేందుకు నాని అమెరికాలో ల్యాండ్ అయ్యారు. చిత్ర యూనిట్ ప్రయత్నాలు బాగానే వర్కవుట్ కావడంతో ఓవర్సీస్‌లో నాని చిత్రానికి ఇప్పటి వరకు రూ.19 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

హిట్ 3 నాలుగో రోజు వసూళ్లు ఎంతంటే?

నాలుగో రోజు హిట్ 3 తెలుగు వెర్షన్‌కు ఓవరాల్‌గా 49.96 శాతం .. తమిళంలో 41.34 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 511, బెంగళూరులో 331, విజయవాడలో 119, విశాఖలో 139 , చెన్నైలో 66 షోలు పడ్డాయి. ఆదివారం స్వల్పంగా బుకింగ్ తగ్గడంతో నాలుగో రోజు హిట్ చిత్రానికి ఇండియా వైడ్‌గా రూ.9.50 కోట్ల నికర వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. నాలుగు రోజుల వరకు ఇండియాలో హిట్ సినిమాకు రూ. 49.4 కోట్ల నెట్ , రూ.51.31 కోట్లు గ్రాస్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ తెలిపింది. ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ కలెక్షన్స్ రూ.19 కోట్లు కలిపి హిట్ 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ఈ వారంలో హిట్ 3 సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మని నాని ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X