HIT 3 Day 5 Box Office : నాని సరికొత్త బాక్సాఫీస్ చరిత్ర.. తొలి హీరోగా రికార్డు, హిట్ 3కి ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. మే 1న కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని హిట్ 3ని నిర్మించారు. విడుదలైన ఐదు రోజులు కావొస్తున్నా ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో 5వ రోజు హిట్ 3 చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందో చూస్తే:

HIT 3 Movie Day 5 Box Office Collections Worldwide Nani s film earnings majorly declined on Monday

హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్

నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి హిట్ 3 సినిమాకు దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యిందని ఫిలింనగర్ టాక్. సినిమా డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొన్నది. ఆడియో రైట్స్‌ 6 కోట్లు, శాటిలైట్ రైట్స్ కింద 12 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

థియేట్రికల్ రైట్స్ బిజినెస్

నైజాం హక్కులు 13 కోట్లు రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ విషయానికి వస్తే.. 15 కోట్ల మేర జరిగింది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో 33.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ 5 కోట్లు కింద ఇండియాలో ఈ సినిమా రూ.38.5 కోట్ల వ్యాపారం చేసింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు కలిపి మొత్తంగా హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

హిట్ 3 సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషన్ కార్యక్రమాల కారణంగా హిట్ 3పై హైప్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇండియాలో నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

హిట్ 3కి తొలి రోజు భారత్‌లో రూ.21 కోట్ల నెట్, రెండో రోజు 10.5 కోట్ల నెట్, మూడో రోజు రూ.10.4 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.10.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. నాలుగు రోజుల వరకు ఇండియాలో హిట్ 3 నికరంగా 52 కోట్లు కలెక్ట్ చేసింది. ఆంధ్రా, తెలంగాణ వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ.20.25 కోట్ల నెట్, రెండో రోజు రూ.10 కోట్ల నెట్, మూడో రోజు రూ.9.8 కోట్ల నెట్, నాలుగో రోజున రూ.9.4 కోట్ల నెట్ చొప్పున తెలుగు రాష్ట్రాల్లో నికరంగా 50 కోట్ల రూపాయలు రాబట్టాడు నాని. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. తమిళంలో రూ.కోటి ఆరు లక్షల నెట్, కన్నడంలో 19 లక్షల రూపాయల నెట్, హిందీలో కోటి పది లక్షల రూపాయల నెట్, మలయాళంలో 46 లక్షల రూపాయలు ఆర్జించింది హిట్ చిత్రం.

ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతంటే?

ట్రేడ్ వర్గాల అంచనాలను నిజం చేస్తూ ఓవర్సీస్‌లో నాని చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హిట్ అక్కడ తొలి రోజు వన్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. దానిని మరింత పెంచేందుకు హీరో నానితో సహా చిత్ర యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడంతో అది బాగా ప్లస్ అయ్యింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు రూ.21 కోట్లు కలెక్ట్ చేసి దుమ్మురేపుతున్నాడు నాని. ఓవర్సీస్ వసూళ్లు హిట్ 3 .. వంద కోట్లు దాటడానికి కారణమయ్యాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.

హిట్ 3 ఐదో రోజు వసూళ్లు ఎంతంటే?

ఐదో రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో హిట్‌ 3కి బుకింగ్స్ తగ్గాయి. తెలుగులో 24.01 శాతం, తమిళంలో 20.02 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 493, బెంగళూరులో 356, విజయవాడలో 113, విశాఖలో 143 , చెన్నైలో 55 షోలు పడ్డాయి. ఐదో రోజు హిట్ 3 చిత్రం 4.15 కోట్ల రూపాయలు నికరంగా అందుకుంది. తద్వారా ఐదు రోజుల వరకు నాని సినిమా ఇండియాలో రూ.56.17 కోట్ల నెట్.. రూ.61.6 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ + ఓవర్సీస్‌ వసూళ్లు రూ.21 కోట్లు కలిపి హిట్ 3 సినిమా ఐదు రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.82.6 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. అయితే హిట్ 3 చిత్రం 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా అధికారికంగా ప్రకటించింది. కేవలం నాలుగు రోజుల్లోనే హిట్ 3 ప్రపంచవ్యాప్తంగా రూ.101 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలిపింది. తద్వారా సరిపోదా శనివారం తర్వాత తన కెరీర్‌లో రెండోసారి వంద కోట్ల క్లబ్‌లో చేరారు నాని. అంతేకాదు హిట్ ఫ్రాంఛైజీలోనే తొలిసారి వంద కోట్లు కొట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు.

నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం హిట్ 3 బ్రేక్ ఈవెన్ టార్గెట్ కొట్టేసినట్లే.. ఇకపై వచ్చేదంతా లాభాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడంతో ఈ వారం హిట్ 3 ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X