HIT 3 Day 6 Box Office : దగడ్ పుట్టిస్తున్న నాని.. హిట్ 3 6 రోజుల వసూళ్లు.. దెబ్బకు టార్గెట్ రీచ్
వరుస హిట్లతో దుమ్ములేపున్న నాని తాజాగా 'హిట్ 3' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో నాని విశ్వరూపం చూపించాడు. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. కాగా, హిట్ 3 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూల్ చేసింది.. ఇంకెంత వసూల్ చేయాల్సి ఉందనే వివరాల్లోకి వెళితే...
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్ (Hit 3 Budget)
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో టాప్ నటీనటులు, టెక్నీషియన్లతో పని చేయించారు. మరోవైపు ప్రమోషన్స్ ను గట్టిగానే నిర్వహించారు. ఇలా రెమ్యునరేషన్, ప్రొడక్షణ్ ఖర్చు, ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని Hit3కి రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఇక బిజినెస్ విషయానికొస్తే.. డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూ. 54 కోట్లకు సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ ను రూ.6 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడైంది.

థియేట్రికల్ రైట్స్ బిజినెస్
హిట్ 3 థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే జరిగింది. నైజాం హక్కులు రూ.13 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.15 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.33.5 కోట్ల కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా మొత్తంగా రూ.5 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ రైట్స్ తో రూ.10 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రూ.48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. దీంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 50 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
హిట్ 3 గత 5 రోజుల వసూళ్ల వివరాలు..
భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన హిట్ 3 చిత్రానికి బాక్సాఫీస్ రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రస్తుతం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇక ఈ చిత్రం గత 5 రోజుల వసూళ్ల విషయానికొస్తే.. మొదటి రోజు రూ.21 కోట్ల నెట్, 2వ రోజు రూ.10.5 కోట్ల నెట్, 3వ రోజు రూ.10.4 కోట్లు, 4వ రోజు రూ.10.25 కోట్లు, 5వ రోజు రూ.3.65 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసినట్టు సాక్ నిల్క్ గణాంకాలు తెలిపాయి. ఇక 5 రోజుల్లో ఇండియా నెట్ రూ.55.8 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.65.90 కోట్లు అయ్యింది. వరల్డ్ వైడ్ గా రూ.88.50 కోట్ల గ్రాస్ సంపాదించింది.
Hit3 6వ రోజు వసూళ్లు ఎంతంటే?
6వ వర్కింగ్ డే కావడంతో ఈ చిత్ర వసూళ్ల కాస్తా తగ్గుముఖం పట్టాయి. థియేటర్లలో ఓవరాల్ గా 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. అయినా పాన్ ఇండియా చిత్రం కావడంతో నాని కోట్లల్లోనే రాబడుతున్నాయి. ఈ క్రమంలో 6వ రోజు ఇండియా నెట్ రూ.2.75 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ తాజా రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఇండియా నెట్ రూ.58.41 కోట్లకు చేరుకుంది. ఇక 6వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా రూ.95 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
6 రోజుల ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత?
ఓవర్సీస్‌లో నాని ఫ్యాస్ బేస్ దృష్ట్యా హిట్ 3కి రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు సాధించిన ఈ చిత్రం 6 రోజుల్లో ఓవర్సీస్ లో రూ.25 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇక నాని ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో లాభాల్లో బాటలో ఎంత వసూళ్లు అందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











