HIT 3 Day 7 Box Office : నాని హ్యాట్రిక్.. హిట్ 3 7 రోజుల వసూళ్లు.. ఎన్ని కోట్లో తెలుసా?
నేచురల్ స్టార్ నాని వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ దుమ్ము లేపుతున్నారు. ఏకంగా 100 కోట్ల సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'హిట్ 3' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి జంటగా నటించింది. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించారు. కాగా, హిట్ 3 బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూల్ చేసింది.. ఇంకెంత వసూల్ చేయాల్సి ఉందనే వివరాల్లోకి వెళితే...
హిట్ 3 బడ్జెట్ అండ్ బిజినెస్ (Hit 3 Budget)
హిట్ 3 చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లతో పని చేయించారు. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడంతో ఖర్చు భారీగానై అయ్యింది. ఇలా రెమ్యునరేషన్, ప్రొడక్షన్, ప్రమోషన్ ఖర్చులు కలుపుకొని Hit3కి రూ.60 కోట్ల బడ్జెట్ అయ్యింది. బిజినెస్ విషయానికొస్తే.. డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ. 54 కోట్లకు సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ రూ.6 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.12 కోట్లకు అమ్ముడయ్యాయి.

థియేట్రికల్ రైట్స్ బిజినెస్..
నైజాం రైట్స్ రూ.13 కోట్లు, సీడెడ్ రైట్స్ రూ.5.5 కోట్లు, ఆంధ్రా రైట్స్ రూ.15 కోట్ల, తెలుగు రాష్ట్రాల్లో రూ.33.5 కోట్ల కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా మొత్తంగా రూ.5 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ రైట్స్ తో రూ.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా వరల్డ్ గా రూ.48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 50 కోట్ల షేర్, రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
హిట్ 3 గత 6 రోజుల వసూళ్ల వివరాలు..
హిట్ 3 బాక్సాఫీస్ రెస్పాన్స్ అదిరిపోయింది. మొదటి రోజు రూ.21 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.10.5 కోట్ల ఇండియా నెట్, 3వ రోజు రూ.10.4 కోట్లు, 4వ రోజు రూ.10.25 కోట్లు, 5వ రోజు రూ.3.65 కోట్లు, 6వ రోజు రూ.3.25 కోట్ల వరకు ఇండియా నెట్ వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. కేవలం 6వ రోజే రూ.7 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక 6 రోజుల వరకు ఇండియా నెట్ రూ.61.06 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.69.7 కోట్లు, వరల్డ్ వైడ్ గా రూ.92.5 కోట్లు కలెక్ట్ చేసింది.
Hit 3 7వ రోజు వసూళ్లు ఎంతంటే?
7వ వర్కింగ్ డే అయినా హిట్ 3కి మంచి వసూళ్లు దక్కాయి. తెలుగులో రూ.1.92 కోట్ల నెట్, తమిళంలో రూ.9 లక్షలు వసూల్ చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.2.15 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ లెక్కల ప్రకారం.. ఇండియా గ్రాస్ రూ.5 కోట్లు వసూల్ చేసి ఉంటుందని, వరల్డ్ వైడ్ గా రూ.కోటీ మీదనే వసూలై ఉంటుందని ట్రేడ్ పండింతులు చెబుతున్నారు. దీంతో 7వ రోజుతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.101 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో నాని బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ హిట్ రిపీట్ చేశారు. 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 3వ చిత్రంగా హిట్ 3 నిలిచింది. మొదట 'దసరా', ఆ తర్వాత 'సరిపోదా శనివారం' వంటి చిత్రాలతో రూ.100 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇక హిట్ 3 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకుంది. మున్ముందు ఎంత లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.
7 రోజుల ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత?
ఓవర్సీస్‌లో హిట్ 3కి రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే 1.5 మిలియన్లు సాధించిన ఈ చిత్రం 7 రోజుల్లో ఓవర్సీస్ లో రూ.23 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక నాని ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో లాభాల్లో బాటలో ఎంత వసూళ్లు అందిస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.


Click it and Unblock the Notifications











