HIT movie 3 days Collections: నానికి కాసుల పంట పండిస్తున్న విశ్వక్ సేన్
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన రెండో చిత్రం హిట్. యువ హీరో విశ్వక్ సేన్, రుహానీ శర్మ జంటగా నటించిన ఈ చిత్రం మంచి టాక్‌ను తొలి రోజే సొంతం చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడుతూ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచే చిత్రంగా రూపుదిద్దుకొన్నది. ఫిబ్రవరి 28వ తేదీన రిలీజైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

నానికి కాసుల పంట
విడుదలైన ప్రతీ చోట హిట్ చిత్రం నానికి కాసులు పంట పండిస్తున్నది. గత మూడో రోజున ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.1.14 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.5 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. సోమవారం ఈ చిత్రం నిలకడగా వసూళ్లు రాబడితే కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Recommended Video


హిట్ 3వ రోజు కలెక్షన్లు ఇలా..
ఏపీ, తెలంగాణలోని ఏరియాల వారీగా వసూళ్లు చూస్తే.. నైజాంలో రూ.70 లక్షలు, సీడెడ్‌లో రూ.8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.12 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.4 లక్షలు, గుంటూరులో రూ.6 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.6 లక్షలు, నెల్లూరులో రూ.3 లక్షలు వసూలు చేసింది. దీంతో మూడో రోజు రూ.1.14 కోట్లుగా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా హిట్ మూవీ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం రూ. 2 కోట్లు
సీడెడ్ రూ. 30 లక్షలు
ఉత్తరాంధ్ర రూ. 35 లక్షలు
ఈస్ట్ రూ. 17 లక్షలు
వెస్ట్ రూ. 15 లక్షలు
కృష్ణా రూ. 19 లక్షలు
గుంటూరు రూ. 26 లక్షలు
నెల్లూరు రూ. 9 లక్షలు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.3.55 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.18 లక్షలు, ఓవర్సీస్‌లో 79 లక్షలతో మొత్తంగా ఈ చిత్రం రూ.45 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

హిట్ ప్రీ రిలీజ్ బిజినెస్
ప్రపంచవ్యాప్తంగా హిట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు
నైజాం రూ. 1.4 కోట్లు
సీడెడ్ రూ. 40 లక్షలు
ఆంధ్రా మొత్తం రూ.1.8 కోట్లతో ఏపీ, తెలంగాణలో రూ.3.6 కోట్లు రాబట్టింది.
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ.20 లక్షలు,
ఓవర్సీస్‌లో రూ.60 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.4.40 కోట్ల బిజినెస్ చేసింది. 5 కోట్ల రూపాయల లక్ష్యం బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికే ఆ టార్గెట్‌కు చేరువైంది. త్వరలోనే ఈ సినిమా డిస్టిబ్యూటర్లకు లాభాలను పంచనున్నది.


Click it and Unblock the Notifications











