Demon Slayer Box Office : 2 రోజుల్లో 3500 కోట్లు.. బాక్సాఫీస్ షేక్.. డీమాన్ స్లేయర్ ఇండియా కలెక్షన్స్ ఎంతంటే?

జపానీస్ యానిమేటెడ్ డార్క్ పాంటసీ యాక్షన్ చిత్రంగా డీమాన్ స్లేయర్ రూపుదిద్దుకుంది. డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ గా సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ జరిగింది. అయితే ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా దుమ్ములేపే వసూళ్లను అందుకుంటోంది. తెలుగు స్టేట్స్‌తో పాటు ఇతర స్టేట్స్‌లో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత వసూల్ చేసింది? ఇండియాలో ఎంత వసూలైందనే వివరాల్లోకి వెళితే..

డీమాన్ స్లేయర్ మూవీ బడ్జెట్?
ఈ సినిమాలో నాట్సూకీ హానే, అకరీ కిటో, యాషిట్సుగు మాటస్కురా, హీరో షిమోనో, టకహిరో సాకురాయ, అకీరా ఇషిదా వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ నటించారు. యూఫో టేబుల్ నిర్మించిన ఈ చిత్రానికి హారూ సోటోజాకీ దర్శకత్వం వహించారు. టాప్ టెక్నీషియన్లు యూచీ టెరావో సినిమాటోగ్రఫి, మానాబు కమినో ఎడిటింగ్, యూకీ కుజీరా మ్యూజిక్ అందించారు. ఏషియన్ కంట్రీస్‌లో ఈ సినిమాను సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.180 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Hollywood film Demon Slayer Day 2 Worldwide Box Office Collections

డీమాన్ స్లేయర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదలవ్వడం విశేషం. జపనీస్ భాషలో ఈ చిత్రం జూలై 18నే గ్రాండ్ గా విడుదలై ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇండియాతో పాటు ఓవర్సీస్ లో సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.360 కోట్ల వరకు వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు తెలుపున్నారు. కానీ ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది.

డీమాన్ స్లేయర్ ఓపెనింగ్ డే కలెక్షన్లు?
ఈ సినిమా ఓపెనింగ్ డే మైండ్ బ్లోయింగ్ వసూళ్లు సాధించింది. ఇండియాలో నెట్ రూ.13 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.16 కోట్లు వసూల్ చేసింది. ఒక ఓవర్సీస్ లో రూ.1550 కోట్లు వసూళ్లు చేసింది. మిగిలిన దేశాల్లోని వసూళ్లు కలుపుకొని డే1 రూ.2400 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 2వ రోజు ఇండియాలో రూ.14 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక గ్రాస్ రూ.18 కోట్ల వరకు వసూలైంది. దీంతో 2 రోజుల్లో ఈ చిత్రం ఇండియా నెట్ రూ.27 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.34 కోట్లకు చేరుకుంది.

ఇక తెలుగు వెర్షన్ లో రూ.40 లక్షలు నెట్, తమిళంలో రూ.30 లక్షలు, హిందీలో రూ.5.5 కోట్లు, ఇంగ్లీష్ వెర్షన్ ఇన్ ఇండియాలో రూ.5.50 కోట్లు, జపనీస్ భాషలో రూ.16 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేయడం విశేషం. ఇలా 2 రోజుల్లో ఇండియా+ ఓవర్సీస్ కలుపుకొని టోటల్ గా రూ.3450 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్టుగా సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X