Demon Slayer Box Office: బాక్సాఫీస్ షేక్.. వారంలో 4500 కోట్ల వసూళ్లు.. ఇండియాలో డీమాన్ స్లేయర్ దూకుడు
భారీ యాక్షన్ ఫిల్మ్స్, విజువల్ వండర్స్ కు ప్రేక్షకుల్లో ఎంతటి ఆదరణ ఉందో, యానిమేటెడ్ ఫిల్మ్స్ కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇండియాలో మహావతార్ నర్సింహా తర్వాత ప్రస్తుతం హాలీవుడ్ నుంచి జపనీస్ యానిమేటెడ్ డార్క్ పాంటసీ యాక్షన్ చిత్రం డీమాన్ స్లేయర్ వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చింది. డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ గా సెప్టెంబర్ 12న రిలీజ్ అయ్యింది. ఇండియాలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. కాగా ఈ మూవీ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత? 7 రోజుల్లో ఇండియాలో ఎంత వసూల్ చేసింది? వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..
డీమాన్ స్లేయర్ మూవీ బడ్జెట్?
ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ నాట్సూకీ హానే, అకరీ కిటో, యాషిట్సుగు మాటస్కురా, హీరో షిమోనో, టకహిరో సాకురాయ, అకీరా ఇషిదా ఈ యానిమేటెడ్ ఫిల్మ్ లో నటించారు. యూఫో టేబుల్ నిర్మించగా, హారూ సోటోజాకీ దర్శకత్వం వహించారు. యూచీ టెరావో సినిమాటోగ్రఫి, మానాబు కమినో ఎడిటింగ్, యూకీ కుజీరా మ్యూజిక్, ఇలా టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రచార ఖర్చులు కలుపుకొని సినిమాకు రూ.180 కోట్ల బడ్జెట్ అయ్యింది.

డీమాన్ స్లేయర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ చిత్రాన్ని ఏషియన్ కంట్రీస్‌లో సోనీ పిక్చర్స్ రిలీజ్ చేసింది. డీమాన్ స్లేయర్ సిరీస్ లకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండింది. ఈ క్రమంలో తాజాగా డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ వరల్డ్ వైడ్ గా విడుదలైంది. జపనీస్ జూలై 18నే విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లో సెప్టెంబర్ 12న విడుదలైంది. ఈ చిత్రం రూ.360 కోట్లు వసూల్ చేస్తే లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
డీమాన్ స్లేయర్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు?
డీమాన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాజిల్ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి వసూళ్లే దక్కుతున్నాయి. ఇక వారం రోజుల్లోనే 4300 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఓవర్సీస్ లో రూ.2300 కోట్లు, జపనీస్ లో రూ.2000 కోట్లు, ఇండియాలో రూ.65 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నాయి.
ఇండియాలో 7 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.12.85 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.13.10 కోట్లు, 3వ రోజు రూ.13.85 కోట్లు, 4వ రోజు రూ.4 కోట్లు, 5వ రోజు రూ.4 కోట్లు, 6వ రోజు రూ.3.13 కోట్లు, ఇక 7వ రోజు రూ.2.27 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. వారం రోజుల్లో ఇండియాలో డీమాన్ స్లేయర్ రూ.53 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.65 కోట్లకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
భాషల వారీగా కలెక్షన్లు పరిశీలిస్తే.. ఇండియాలో జపనీస్ భాషలో రూ.29.53 కోట్లు, ఇంగ్లీష్ లో రూ.10.50 కోట్లు, హిందీలో రూ.12 కోట్లు, తెలుగులో రూ.65 లక్షలు, తమిళంలో రూ.60 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











