twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2020లో భారీ స్థాయిలో నష్టపోయిన హాలీవుడ్.. ఏకంగా 70శాతం పతనం!

    |

    సినిమా ప్రపంచంలో ఎక్కువగా డామినేట్ చేసే హాలీవుడ్ స్థాయి ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. కరోనా కారణంగా చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా లక్షల కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. ప్రతి ఏడాది 35కి పైగా బిలియన్స్ డాలర్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ స్టామినాను పెంచుకుంటున్న హాలీవుడ్ ఈ సారి వాటితో ఫాలొస్తే తీవ్రంగా నష్టాలను ఎడిర్కోవాల్సి వచ్చింది.

    2019లో విడుదలైన ఇంగ్లీష్ సినిమాలన్ని 42 బిలియన్‌ డాలర్లతో కలెక్షన్స్ తో ఒక్కసారిగా ఆ ఇండస్ట్రీ స్థాయిని పెంచాయి. మన కరెన్సీలో దాదాపు రూ.3 లక్షలకోట్లతో సమానం. అయితే ఈ సారి ఆ వసూళ్లతో పోల్చుకుంటే మాత్రం దాదాపు 70 శాతం బిజినెస్ కు దెబ్బ పడింది. హాలీవుడ్ సినిమాలు ఆగిపోవడం వలన కొన్ని లక్షల మంది ఉపాధి కొల్పయారు కూడా. చరిత్రలో హాలీవుడ్ ఇండస్ట్రీకి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

    Hollywood industry biggest disaster in 2020

    ఒక్క అమెరికాలోనే దాదాపు 11.32 బిలియన్‌ డాలర్ల నష్టం. అంటే రూ.84వేల కోట్లు వచ్చేవి. 2020లో విడుదలైన కొన్ని సినిమాల కలెక్షన్స్ విషయంలోకి వస్తే.. ఆ వసూళ్లు 2.3 బిలియన్‌ డాలర్స్ మాత్రమే. మన కరెన్సీ లో సుమారు రూ. 18వేలకోట్లకి పడి పోయిందనే చెప్పాలి. చివరగా 1980లో వచ్చిన కలెక్షన్స్ కంటే ఇది చాలా తక్కువనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ సారి విడుదల కావాల్సిన జేమ్స్ బాండ్ సినిమాతో పాటు మరికోన్ని హాలీవుడ్ సినిమాలు ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9, ది క్వైట్‌ ప్లేస్‌2, పీటర్‌ ర్యాబిట్‌2, గాడ్జిల్లా వర్సస్‌ కాంగ్‌ వంటి సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యాయి.

    English summary
    The level of Hollywood that dominates the movie world the most has dropped drastically this year. Corona had to see millions of crores of losses like never before in history. Hollywood, which is increasing its box office stamina with collections of over $ 35 billion every year, has had to face serious losses this time around.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X