టాప్ చేర్ లో ‘2012 యుగాంతం’!
ఇటీవల టాలీవుడ్ లో సినిమాల రిలీజుల సంఖ్య గణనీయంగా పెరిగినా...అందుకు తగ్గట్టు ప్రేక్షకాదరణ మరియు వాటికి తగ్గ సక్సెస్ రేటు మాత్రం పెరగడం లేదు. రామ్ చరణ్ తేజ నటించిన 'మగధీర" తర్వాత ఇంతదాకా మరో పెద్ద చిత్రం నామ మాత్రపు విజయం కూడా సాధించలేదు. అల్లరి నరేష్ నటించిన 'బెండు అప్పారావు" మాత్రము యథావిధిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక పోతే సాయిరాం శంకర్ నటించిన 'బంపర్ ఆఫర్" కూడా ఓ మాదిరిగా ఆడుతోంది. గత వారం విడుదలైన 'విలేజ్ లో వినాయకుడు" కి ప్రేక్షకులే కరువయ్యారు. మరి శ్రీకాంత్ నటించిన 'అ ఆ ఇ ఈ" పరిస్థితి ఇంచుమించు అదేలా వుంది. రెబల్ స్టార్ ప్రబాస్ నటించిన 'ఏక్ నిరంజన్" కలెక్షన్స్ పరంగా యావరేజ్ స్థాయిని అందుకోడానికి అపసోపాలు పడుతోంది. ఈ వారం లో వచ్చిన వరున్ సందేష్ 'కుర్రాడు"కి కూడా టాక్ వీక్ గా ఉంది. హాలీవుడ్ డబ్బింగ్ సినిమా '2012"యుగాంతం మాత్రం ప్రేక్షకులని థియేటర్లకు రాబడుతోంది.


Click it and Unblock the Notifications











