ఈ వారమే విడుదల..ఓపినింగ్స్ బాగుంటాయి

By Srikanya

హైదరాబాద్: అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'గీతాంజలి'. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో కనిపిస్తారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మాత. కోన వెంకట్‌ సమర్పకులు.చిత్రం ఈ నెల 8 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. టైటిల్, అంజలి, కోన వెంకట్ కాంబినేషన్ తో ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఓపినింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ఎవరూ వూహించని కథ కథనాలతో రాబోతున్న చిత్రమిది. హారర్‌, వినోదం కలగలిపి ఉంటాయి. అంజలికి నటిగా మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది'' అన్నారు. అలాగే ఈ చిత్రంలో అంజలి రెండు పాత్రలను పోషిస్తోందని తెలుస్తోంది. కాలేజీకి వెళ్ళే అమ్మాయిగా, గృహిణిగా ఈ పాత్ర సాగుతుందని చెప్తున్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ... హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర కీలకం అన్నారు. ప్రపంచంలో భూతాలు, ప్రేతాలు బెస్ట్. మిగిలినవన్ని వేస్ట్ అనుకొనే టైపు మనిషి సైతాన్‌రాజ్. కొరివి దెయ్యాలతో కబుర్లు, పిశాచాలతో పబ్బులు, క్లబ్బులు అంటూ తిరుగుతుంటాడు. అతని పేరు చెబితే దెయ్యాలు కూడా నిదురపోవు. అటువంటి సైతాన్‌రాజ్ ఓ అమ్మాయిని చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అందుకు గల కారణాలు ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు కోన వెంకట్.

 Horror Comedy Geethanjali on August 8th

బ్రహ్మానందం మాట్లాడుతూ... కొందరు పుట్టిన తర్వాత నటులవుతారు.మరికొందరు పుట్టుకతోనే నటులవుతారు. అంజలి రెండో కేటగిరికి చెందుతుంది. ఆమెలో మంచి నటి దాగుంది. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి హీరోగా మారడం ఆనందంగా వుంది అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ అంజలిని దృష్టిలో పెట్టుకొనే ఈ చిత్రకథను తయారుచేశాం. ఆమె అంగీకరించపోతే ఈ సినిమా తెరకెక్కేదికాదు.

నిర్మాత మాట్లాడుతూ... '' ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఆగస్టు 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము''అన్నారు. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌రాణే, బ్రహ్మానందం, రావు రమేష్‌, మధునందన్‌, షకలక శంకర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి కళ: రఘు కులకర్ణి, కూర్పు: ఉపేంద్ర, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X