For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమానే కాదు.. భయపెట్టిస్తున్న కలెక్షన్లు.. బాలీవుడ్‌లో స్త్రీ హంగామా!

    By Rajababu
    |

    బాలీవుడ్‌లో హారర్ కామెడీగా రిలీజైన స్త్రీ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. చిన్న చిత్రంగా వచ్చిన స్త్రీ గత నాలుగు రోజుల్లో భారీ బడ్జెట్ చిత్రానికి మంచి వసూళ్లను సాధిస్తున్నది. రాజ్‌కుమార్ రావు, శ్రద్దాకపూర్ నటించిన చిత్రం కలెక్షన్లపరంగా వారాంతం తర్వాత కూడా దూసుకెళ్తున్నది. కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

    స్త్రీ చిత్రం వారాంతం తర్వాత తొలి సోమవారం రోజు రూ.9.70 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో రూ.41.97 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్న మౌత్ టాక్‌ కారణంగానే ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నదని ట్రేడ్ వర్గాల అభిప్రాయపడ్డాయి.

    Horror comedy Stree movie gets good response at Box office

    స్త్రీ చిత్రం అన్నీ అంచనాలను అధిగమించి కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌పై దాడి చేస్తున్నది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. శుక్రవారం 6.83 కోట్లు, శనివారం 10.87 కోట్లు, ఆదివారం 14.57 కోట్లు వసూలు చేసింది, దేశవ్యాప్తంగా రూ.41.97 కోట్లు వసూలు చేసింది అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

    గతవారం రిలీజైన యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే చిత్రాన్ని వెనక్కు నెట్టింది. రానున్న రోజుల్లో ఇదే స్పందన వ్యక్తమైతే మరిన్ని వసూళ్లను భారీగా సాధించడానికి అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. సినిమా కంటెంట్, రాజ్‌కుమార్ రావు, శ్రద్దా యాక్టింగ్ అద్భుతంగా ఉంది అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నది.

    హారర్ కామెడీ చిత్రాలకు బాలీవుడ్‌లో ఆదరణ ఉంటుదని మరోసారి రుజువైంది. గతంలో భూల్ బులయ్యా, గోల్‌మాల్ అగైన్ చిత్రాల తర్వాత స్త్రీ చిత్రం సత్తా చాటింది అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.

    English summary
    Horror comedy Stree earned Rs 9.70 crore on Monday, takings its total collection to Rs 41.97 crore. The film has been performing well at the box-office, despite competition from Yamla Pagla Deewana Phir Se. The Rajkummar Rao and Shraddha Kapoor film has also benefited from strong word-of-mouth promotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X