Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నితిన్ సినిమాకు రేటు ఫిక్స్ చేసిన హాట్ స్టార్... అప్పుడే రిలీజ్ డేట్ కూడా?
టాలీవుడ్ యువ హీరో నితిన్ మళ్ళీ ఎప్పటిలానే సక్సెస్ ట్రాక్ తప్పాడు. ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని ప్రయోగాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. ఇక నెక్స్ట్ తన ఆశలన్నీ కూడా ఒక బాలీవుడ్ రీమేక్ పైనే పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన చర్చల్లో హాట్ స్టార్ ధరను కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వస్తోంది. రిలీజ్ డేట్ పై కూడా ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది.
రెండు సినిమాలతో..
గత ఏడాది భీష్మ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకొని ట్రాక్ లోకి వచ్చిన నితిన్ మళ్ళీ అదే ఫ్లోతో వెళ్లాలని ఒకేసారి రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. అసలైతే 2020లో వరుసగా మూడు సినిమాలతో రావాలని అనుకున్నాడు కానీ కరోనా వలన గ్యాప్ రాక తప్పలేదు. ఇక ఈ ఏడాది ఒక నెల గ్యాప్ లోనే రెండు సినిమాలతో వచ్చాడు.
వరుసగా డిజాస్టర్స్
ఫిబ్రవరిలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టేసింది. ఇక ఆ తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన రంగ్ దే సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. బ్యాక్ టూ బ్యాక్ మళ్ళీ డిజాస్టర్స్ ను చూడాల్సి వచ్చింది.
ఆ ధరకు హక్కులను సొంతం చేసుకున్న హాట్ స్టార్
ఇక ప్రస్తుతం నితిన్ బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ మాస్ట్రో తో సిద్ధమవుతున్నాడు. అయితే మాస్ట్రో సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. రిలీజ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ గట్టిగానే పోటీ పడగా చివరగా హాట్ స్టార్ 32కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
రిలీజ్ డేట్ ఫిక్స్..?
మాస్ట్రో సినిమాను మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇక హీరోయిన్ గా నాభా నటేష్ ను సెలెక్ట్ చేశారు. సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా ఆల్ మోస్ట్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక సినిమాను హాట్ స్టార్ లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో లేదా సెకండ్ వీక్ లో రిలీజ్ చేయవచ్చని సమాచారం.