twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిజాస్టర్ టాక్‌‌తో బాక్సాఫీస్ వద్ద దుమారం.. కలెక్షన్లతో హోరెత్తిస్తున్న హౌస్‌ఫుల్4

    |

    బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన హౌస్‌ఫుల్ 4 చిత్రం బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నది. బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. అయితే ఈ సినిమాపై సినీ విమర్శకులు పెదవి విరిచారు. ఫ్లాప్ అంటూ రివ్యూలతో హోరెత్తించారు. అయితే తొలివారంలో కొంత వసూళ్లు మందగించినా.. ఆ తర్వాత పుంజుకొన్నాయి. అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందంటే..

    తొలి వారంలో

    తొలి వారంలో

    హౌస్‌ఫుల్ 4 చిత్రం తొలి రోజున రూ.19 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తొలివారంతంలో రూ.18 కోట్లు, ఆదివారం 15 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక సోమవారం ఏకంగా 34. కోట్లు, మంగళవారం రూ.24 కోట్లు, బుధవారం రూ.16 కోట్లు, గురువారం 13 కోట్లు వసూలు చేసింది. దాంతో తొలివారమే రూ.140 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

    ఇక రెండో వారాంతంలో

    ఇక రెండో వారాంతంలో

    ఇక రెండో శుక్రవారం హౌస్‌ఫుల్ 4 చిత్రం రూ.8 కోట్లు, శనివారం రూ.10 కోట్లు, ఆదివారం రూ.13 కోట్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తొలివారాంతంలో ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొని.. విమర్శకుల ధీటుగా సమాధానం చెబుతూ.. గత 10 రోజుల్లో రూ.200 కోట్లకు చేరువైంది. రెండో వారం ముగిసే సమయానికి రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

    రెండోసారి అక్షయ్ కుమార్

    రెండోసారి అక్షయ్ కుమార్

    విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న అక్షయ్ కుమార్ బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఆయన నటించిన గత చిత్రాలను పరిశీలిస్తే మిషన్ మంగళ్ చిత్రం రూ.178 కోట్లు, హౌస్‌ఫుల్ 4 చిత్రం రూ.173 కోట్లు రాబట్టాయి. దీంతో ప్రతీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను పెంచుకొంటూ పోతున్నాడనే స్పష్టమైంది.

    డిజాస్టర్ టాక్ వచ్చినా..

    డిజాస్టర్ టాక్ వచ్చినా..

    ఇటీవల డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్న కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాయి. గతంలో థగ్స్ ఆఫ్ హిందూస్థన్ రూ.135 కోట్లు రాబట్టగా, రేస్ 3 చిత్రం రూ.166 కోట్లు, అలాగే అర్జున్ రెడ్డి సుమారు రూ.300 కోట్లు, తాజాగా హౌస్‌ఫుల్4 చిత్రం లాంగ్ రన్‌లో రూ.220 కోట్లు వసూలు చేస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

    English summary
    Bollywood Akshay Kumar's proved again is stamina at box office. His latest movie House 4 scoring high collections wise. This movie collected Rs.173 crores worldwide in 10 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X