Housefull 5 Day 1 Box Office: బాక్సాఫీస్‌ను కుమ్మేసిన హౌస్‌ఫుల్ 5.. అక్షయ్ కుమార్ మూవీకి కలెక్షన్లు ఎన్ని కోట్

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అలాగే బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హస్‌ఫుల్ 5 సినిమా విశేషాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తిని పెంచారు. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

Housefull 5 Box Office

కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించారు. దాదాపు 19 మంది స్టార్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు. అలాగే యోయో హానిసింగ్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు మకావులో జరిగింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

హౌస్‌ఫుల్ సినిమా సిరీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. 2010 సంవత్సరంలో ఆరంభమైన ఈ సీరీస్ తాజా రిలీజ్‌తో 5వ భాగానికి చేరుకొన్నది. ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఇండియాలో 5 వేల స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 2వ వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 7 వేలకు పైగా స్క్రీన్లలో విడుదల చేశారు. ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ కావడం గమనార్హం.

ఇక భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఓవర్సీస్‌లో మంచి రెస్సాన్స్ వస్తున్నది. తొలి రోజు ఈ సినిమా సుమారుగా 1 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఈ వారాంతానికి 5 మిలియన్ డాలర్లు రాబట్టే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా ఇండియాలో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా ఇండియాలో ముఖ్యంగా ఉత్తర భారతంలోని అన్ని ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 25 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 30 నుంచి 35 కోట్ల రూపాయలు మొదటి రోజు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాల సభ్యులు అంచనా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X