Housefull 5 Day 10 Box Office: 250 కోట్లకు చేరువగా హౌస్‌ఫుల్ 5.. 10వ రోజు అక్షయ్ మూవీ మరో సంచలనం!
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అలాగే గత 5 రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హస్‌ఫుల్ 5 సినిమా విశేషాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేశారు. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తిని పెంచారు. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

హౌస్‌ఫుల్ 5 సినిమా టాక్‌కు సంబంధం లేకుండా వసూళ్లు సాధించింది. ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటేసింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ వసూళ్ల సాధించలేకపోతున్న సమయంలో ఈ మూవీ ఊపిరి పోసింది. తొలి వారాంతం తర్వాత కలెక్షన్లు వేగం పెచింది. దాంతో ఈ సినిమా తొలివారం 128 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా వసూళ్లను సాధిస్తున్నది.
అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్ నటించిన ఈ సినిమా ఇండియాలో 128 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. 8వ రోజు 6 కోట్ల రూపాయలు, 9వ రోజు 10 కోట్ల రూపాయలు, 10వ రోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 156 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 10వ రోజు ఈ సినిమా 12 కోట్లు సాధించడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.
ఓవర్సీస్‌లో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. నార్త్ అమెరికా అంటే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కలిపి ఈ సినిమా మొత్తంగా 50 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండియాలో ఈ సినిమా 158 కోట్ల రూపాయలు నెట్, 170 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టంది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తే.. నిర్మాత 227 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని వెల్లడించారు. రెండో వారంలో ఈ సినిమా 250 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











