Housefull 5 Day 11 Box Office: ఇన్ని కోట్లు ఎలా సాధ్యమవుతోంది.. 2వ వారంలోనూ అక్షయ్ కుమార్ వసూళ్ల మోత
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'హౌజ్ ఫుల్ 5'.ఈ చిత్రానికి తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం జూన్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ప్రస్తుతం మొదటి వారం విజయవంతం చేసుకొని, 2వ వారంలోనూ జోరుగా వసూళ్లు రాబడుతోంది. అయితే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ రోజుకు రూ.5 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. ఇదేలా సాధ్యమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తోపాటు భారీ తారాగణం నటించింది. అలాగే ముఖ్య పాత్రల్లో నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ నటించారు. మరోవైపు టాప్ లెక్నీషియన్లు పనిచేశారు. దీంతో హౌజ్ ఫుల్ 5 చిత్రానికి భారీగానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చు, ప్రమోషన్లు అన్ని కలుపుకొని ఈ చిత్రానికి రూ.225 కోట్లు అయ్యింది.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్?
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే అయ్యింది. అన్ని కలుపుకొని ఈ చిత్రం రూ.240 కోట్లు వసూళ్లు చేయాలని, అలాగైతేనే లాభాల్లో నడుస్తుందని ట్రేడ్ పండితులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా విలువ కట్టారు. కానీ ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వసూల్ చేసింది. అలాగే థియేట్రికల్ రన్ ద్వారా మొదటి వారంలోనే రూ.200 కోట్ల మార్క్ ను దాటడం విశేషం.
10 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్లు, 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు, 8వ రోజు రూ.12 కోట్లు, 9వ రోజు రూ. 12.40 కోట్లు, 10వ రోజు రూ.13 కోట్లు వసూళ్లు చేసింది. 10 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.235 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియా నెట్ రూ.154.25 కోట్లకు, ఇండియా గ్రాస్ రూ.184.25 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్‌లో హౌస్‌ఫుల్ 5 కలెక్షన్లు మొదటి వారంలో జోరుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కాస్తా తగ్గుముఖం పట్టాయి. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో ప్రేక్షకులు ఇంకా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు, 9వ రోజు రూ.1.10 కోట్లు, 10వ రోజు రూ.1.65 కోట్లు వసూళ్లు చేసింది. 10 రోజుల్లో రోజుల్లో రూ.50.75 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
11వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి 2వ వారంలోనూ జోరుగా వసూళ్లు అందుతున్నాయి. వర్కింగ్ డేలోనూ బాక్సాఫీస్ వసూళ్లు అదిరిపోతున్నాయి. ఈ క్రమంలో కేవలం 11వ రోజునే భారీగా వసూళ్లు దక్కాయి. 11వ రోజు ఇండియా నెట్ రూ.4.1 కోట్లు కలెక్ట్ చేసిందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఇక ఇండియా గ్రాస్ రూ.8 కోట్ల వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు 11వ రోజు ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.10 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక 11 రోజుల్లో వరల్డ్ వైడ్ మొత్తంగా ఈ చిత్రం వసూళ్లు రూ.245 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 5 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. 2వ వారం పూర్తైనా 3వ వారంలోనూ రోజుకు రూ.కోటీ తగ్గకుండా వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











