Housefull 5 Day 12 Box Office: రిలీజైన 12వ రోజు కూడా హౌజ్ ఫుల్ 5కి కోట్లల్లో కలెక్షన్లు.. ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'హౌజ్ ఫుల్ 5'. తరుణ్ మన్సఖానీ ఈ చిత్రానికి దర్శకుడు. జూన్ 6న ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేచే వసూళ్లు వస్తున్నాయి. ప్రస్తుతం 2వ వారంలోనూ విజయవంతంగా వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 12 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల ఎంతనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్ ఎంత?
కామెడీ, థ్రిలర్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ముఖ్య పాత్రల్లో సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ అలరించారు. ఈ చిత్రానికి యోయో హనీ సింగ్ సంగీతం అందించారు. టాప్ టాప్ లెక్నీషియన్లు అద్భుతంగా పనిచేశారు. ఇలా హౌజ్ ఫుల్ 5 చిత్రానికి భారీగానే ఖర్చైంది. నటీనటుల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చు, చిత్రాన్ని గ్రాండ్ గా ప్రమోట్ చేసేందుకు అయిన ఖర్చులన్నీ కలుపుకొని రూ.225 కోట్లు అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే అయ్యింది. రూ.235 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే థియేట్రికల్ రన్ ద్వారా రూ.240 కోట్లు వసూళ్లు చేయాలని బ్రేక్ ఈవెన్ పాయింట్ ను నిర్ణయించారు ట్రేడ్ పండింతులు. అయితే ఇప్పటికే ఇందులో డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వచ్చాయి. ఇక థియేట్రికల్ రన్ ద్వారా కేవలం రూ.105 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోద్ది. కానీ ఇప్పటికే ఆ మార్క్ ను ఎప్పుడో దాటేసిందీ చిత్రం.
11 రోజుల హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం ఓపెనింగ్ రోజే వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు, 8వ రోజు రూ.12 కోట్లు, 9వ రోజు రూ. 12.40 కోట్లు, 10వ రోజు రూ.13 కోట్లు, 11వ రోజు రూ.8 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా 11 రోజుల వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 243 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ తెలియజేసింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
హౌస్‌ఫుల్ 5 ఓవర్సీస్ కలెక్షన్లు మొదటి వారం అదిరిపోయాయి. ఇప్పుడు 2వ మాత్రం తగ్గుముఖం పట్టాయి. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కడం విశేషం. ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు, 9వ రోజు రూ.1.10 కోట్లు, 10వ రోజు రూ.1.65 కోట్లు, 11వ రోజు రూ.3.60 కోట్లు వసూళ్లు చేసింది.
12వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి 12 రోజు కూడా దుమ్మురేపే వసూళ్లు అందాయి. 12వ రోజు ఈ చిత్రానికి ఇండియా నెట్ రూ.4.15 కోట్లు వసూలైందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇండియా గ్రాస్ రూ.6 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. మరోవైపు 12వ రోజు ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.8.5 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక 12 రోజుల్లో ఇండియా నెట్ రూ.162.15 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని ఈ చిత్రం రూ.300 కోట్లకు చేరువలో ఉందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఈ చిత్రం విడుదలైన 12వ రోజు కూడా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











