Housefull 5 Day 13 Box Office: అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ జాతర.. 13వ రోజు ఎన్ని కోట్లు వసూలైందంటే?
తెలుగు ప్రేక్షకుల్లోనూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు మంచి క్రేజ్ ఉండింది. కాగా అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం 'హౌజ్ ఫుల్ 5'.ఈ చిత్రానికి తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం జూన్ 6న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం 2వ వారం థియేట్రికల్ రన్ విజయవంతంగా కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ూడా వసూళ్లు జోరుగా అందుతున్నాయి. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 13 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ల ఎంతనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్ ఎంత?
హౌజ్ ఫుల్ 5 చిత్రం భారీ బడ్జెట్ తోనే రూపుదిద్దుకుంది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా హీరోహీరోయిన్లుగా నటించారు. మరోవైపు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక యోయో హనీ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. భారీ లోకేషన్లు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రాన్ని నిర్మించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో భారీగానే ఖర్చైంది. నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్ కలుపుకొని ఈ చిత్రానికి రూ.225 కోట్లు వెచ్చించారని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
వరల్డ్ వైడ్ గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా హౌజ్ ఫుల్ 5 చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే థియేట్రికల్ రన్ ద్వారా రూ.240 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుందని, బ్రేక్ ఈవెన్ పాయింట్ ను ట్రేడ్ వర్గాలు నిర్ణయించారు. కాగా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి రూ.135 కోట్లు తిరిగి రావడం విశేషం.
12 రోజుల్లో హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం ఓపెనింగ్ రోజే వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు, 8వ రోజు రూ.12 కోట్లు, 9వ రోజు రూ. 12.40 కోట్లు, 10వ రోజు రూ.13 కోట్లు, 11వ రోజు రూ.8 కోట్లు, 12వ రోజు రూ.5.50 కోట్లు వసూళ్లు చేసింది. దీంతో 12 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.248 కోట్ల గ్రాస్ రాబట్టందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్ లో హౌజ్ ఫుల్ 5 చిత్రానికి మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు, 9వ రోజు రూ.1.10 కోట్లు, 10వ రోజు రూ.1.65 కోట్లు, 11వ రోజు రూ.3.60, రూ.12వ రోజు రూ.75 లక్షలు వసూళ్లు చేసింది. 12 రోజుల్లో రూ.55 కోట్లు రాబట్టింది.
13వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి 13 రోజు వర్కింగ్ డే కావడంతో కాస్తా వసూళ్లు తగ్గాయి. 13వ రోజు ఈ చిత్రానికి ఇండియా నెట్ రూ.3 కోట్లు వసూలైంది సాక్ నిల్క్ వెల్లడించింది. దీంతో ఇండియా నెట్ 13వ రోజు వరకు రూ.165.25 కోట్లకు చేరుకుంది. ఇక 13వ రోజు గ్రాస్ రూ.6 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో 13వ రోజు వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.265 కోట్లకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. థర్డ్ వీక్ లో రూ.300 కోట్లు పక్కా వసూల్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











