Housefull 5 Day 14 Box Office: హౌజ్ ఫుల్ 5 14వ రోజు కలెక్షన్లు.. 2 వారాల్లో రూ.300 కోట్లు.. వసూళ్ల జాతరంటే ఇదే
బాలీవుడ్ చిత్రం హౌజ్ ఫుల్ 5 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. 2 వారాలుగా ఈ చిత్రం మిక్డ్స్ టాక్ తోనూ జోరుగా వసూళ్లు సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ కామెడీ త్రిల్లర్ చిత్రం జూన్ 6న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచిగా వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్ ఎంత?
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు. యోయో హనీ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. మరోవైపు చిత్ర నిర్మాణంలో అత్యాధునిక టెక్నాలజీని వాడటం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం వల్ల సినిమాకు భారీగానే ఖర్చైంది. దీంతో ఈ చిత్రానికి రూ.225 కోట్లు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. చిత్రం లాభాల్లోకి రావాలంటే థియేట్రికల్ రన్ ద్వారా రూ.240 కోట్లు వసూళ్లు చేయాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు ట్రేడ్ పండితులు. కాగా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి రూ.135 కోట్లు తిరిగి రావడం విశేషం. ఇంకా థియేట్రికల్ రన్ లో రూ.105 కోట్లు రాబట్టాల్సి ఉంది.
13 రోజుల్లో హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం ఓపెనింగ్ రోజే వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు, 8వ రోజు రూ.12 కోట్లు, 9వ రోజు రూ. 12.40 కోట్లు, 10వ రోజు రూ.13 కోట్లు, 11వ రోజు రూ.8 కోట్లు, 12వ రోజు రూ.5.50 కోట్లు, 13వ రోజు రూ.4 కోట్లు వసూళ్లు చేసింది. ఇక 13 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.252.50 కోట్ల గ్రాస్ రాబట్టందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్ లో హౌజ్ ఫుల్ 5 చిత్రానికి మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు, 9వ రోజు రూ.1.10 కోట్లు, 10వ రోజు రూ.1.65 కోట్లు, 11వ రోజు రూ.3.60, రూ.12వ రోజు రూ.75 లక్షలు, 13వ రోజు రూ.50 లక్షలు వసూళ్లు చేసింది. ఇక 13 రోజుల్లో రూ.55.50 కోట్లు రాబట్టింది.
14వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద 2 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. 14వ రోజు ఈ చిత్రానికి రూ.2.65 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. 14వ రోజు ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.5 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 2 వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రానికి రూ.168 కోట్ల ఇండియా నెట్, రూ.200 కోట్ల వరకు ఇండియా గ్రాస్ వసూలైంది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.252.5 కోట్ల వరకు వసూలైందని సాక్ నిల్క్ తెలిపింది. కానీ ఈ చిత్రం రూ.300 కోట్లకు చేరుకుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











