Housefull 5 Day 15 Box Office: హౌజ్ ఫుల్ 5 15వ రోజు కలెక్షన్లు.. అక్షయ్ కుమార్ పై కుబేరా దెబ్బ
2 వారాలుగా బాలీవుడ్ చిత్రం హౌజ్ ఫుల్ 5 నార్త్ ఇండియాలో మంచి వసూళ్లను సాధిస్తోంది. 14 రోజుల పాటు ఈ చిత్రానికి ఎలాంటి పోటీ లేకపోవడంతో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక జూన్ 20న కోలీవుడ్ స్టార్ ధనుష్, నాగార్జున నటించిన కుబేరా చిత్రం థియేటర్లలో రిలీజ్ కావడంతో హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ వసూళ్లపై ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం జూన్ 6న గ్రాండ్ గా విడుదలైంది. తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 15వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 మూవీ బడ్జెట్ ఎంత?
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, స్టార్ హీరోయిన్లు జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ ముఖ్య పాత్రల్లో అలరించారు. యోయో హనీ సింగ్ సంగీతం అందించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పని చేశారు. దీంతో సినిమాకు రూ.225 కోట్లు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా హౌజ్ ఫుల్ 5 చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.240 కోట్లు వసూల్ చేయాలని, ఇదే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ట్రేడ్ పండితులు నిర్ణయించారు. ఇక డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వచ్చాయి. థియేట్రికల్ రన్ లో రూ.105 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్త్తైయినట్టేనని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
14 రోజుల్లో హౌజ్ ఫుల్ 5 బాక్సాఫీస్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం ఓపెనింగ్ రోజే వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్ల గ్రాస్ వసూలైంది. 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు, 8వ రోజు రూ.12 కోట్లు, 9వ రోజు రూ. 12.40 కోట్లు, 10వ రోజు రూ.13 కోట్లు, 11వ రోజు రూ.8 కోట్లు, 12వ రోజు రూ.5.50 కోట్లు, 13వ రోజు రూ.4 కోట్లు, 14వ రోజు రూ.3.85 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. దీంతో 14 రోజు తో వరల్డ్ వైడ్ గా రూ. రూ.256.35 కోట్లు వరల్డ్ వైగా వసూళ్లు సాధించిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్ లో హౌజ్ ఫుల్ 5 చిత్రానికి మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు, 9వ రోజు రూ.1.10 కోట్లు, 10వ రోజు రూ.1.65 కోట్లు, 11వ రోజు రూ.3.60, రూ.12వ రోజు రూ.75 లక్షలు, 13వ రోజు రూ.50 లక్షలు, 14వ రోజు రూ.50 లక్షలు మాత్రమే వసూళ్లు చేసింది. ఇక 14 రోజుల్లో రూ.56 కోట్లు అందుకుంది.
15వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం 3వ వారానికి ఎంట్రీ ఇచ్చింది.దీంతో 15వ రోజు ఈ చిత్రం ఇండియా నెట్ రూ.2.06 కోట్లు వసూల్ చేసింది. 15వ రోజుతో రూ.170.16 కోట్లకు ఇండియా నెట్ చేరుకుందని సాక్ నిల్క్ వెల్లడించింది. ఇక ఇండియా గ్రాస్ రూ.200 కోట్లు దాటడం విశేషం. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. మరోవైపు ట్రేడ్ నిపుణులు మాత్రం ఈ చిత్రం రూ.300 కోట్లకు చేరువలో ఉందని చెబుతున్నారు. ఇక ధనుష్ కుబేరా చిత్రం శుక్రవారం జూన్ 20న తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ విడుదలైంది. దీంతో హౌజ్ ఫుల్ 5 కలెక్షన్లకు స్వల్పంగా గండిపడిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











