Housefull 5 Day 2 Box Office: డిజాస్టర్ టాక్‌తోను బాక్సాఫీస్ ఊచకోత.. హౌస్‌ఫుల్ 5 మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అలాగే బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రెండు క్లైమాక్స్‌లతో హౌస్‌ఫుల్ 5
హస్‌ఫుల్ 5 సినిమా విశేషాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తిని పెంచారు. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

Housefull 5 Day 2 Box Office

సినిమా బడ్జెట్ ఎంత?
కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించారు. దాదాపు 19 మంది స్టార్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు. అలాగే యోయో హానిసింగ్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు మకావులో జరిగింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

భారీగా అడ్వాన్స్ బుకింగ్
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హౌస్‌ఫుల్ 5 చిత్రం విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి గొప్పగా టాక్ సంపాదించుకోలేకకపోయింది. దాదాపు డిజాస్టర్ అనే టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. అయితే ఈ సినిమాకు నమోదైన అడ్వాన్స్, కార్పోరేట్ బుకింగ్ కారణంగా తొలి వారాంతం భారీగా వసూళ్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇండియాలో కలెక్షన్లు
ఇండియాలో అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా ఘనంగా కలెక్షన్ల జర్నీని మొదలు పెట్టింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 24 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు ఈ సినిమా 30 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది అని సాక్ నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ఇండియాలో 54 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అంతేకాకుండా 100 కోట్ల మైలురాయి దిశగా పరుగులు పెడుతున్నది

ఓవర్సీస్‌లో వసూళ్లు

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి రోజు ఈ సినిమా 1.3 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 11 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు భారతీయ కరెన్సీలో వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మూవీ ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X