4 రోజుల్లోనే 100 కోట్లతో హౌస్‌ఫుల్ 5.. అక్షయ్ కుమార్ సంచలన రికార్డు

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అలాగే బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హౌస్‌ఫుల్ 5 మూవీకి రెండు క్లైమాక్స్‌
హస్‌ఫుల్ 5 సినిమా విశేషాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తిని పెంచారు. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

Housefull 5 Day 4

బడ్జెట్ ఎంతంటే?
కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించారు. దాదాపు 19 మంది స్టార్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు. అలాగే యోయో హానిసింగ్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు మకావులో జరిగింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

ఇండియాలో ఎన్ని కోట్లంటే?
హౌస్‌ఫుల్ 5 సినిమా మిక్స్‌డ్ రివ్యూలను సొంతం చేసుకొన్నది. దాదాపు డిజాస్టర్ టాక్‌తో ఈ మూవీ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు 24 కోట్లు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, మూడో రోజు 33 కోట్లు రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 4 రోజుల్లో 100 కోట్లు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ ఇంత వేగంగా 100 కోట్లు దాటడం రేర్ రికార్డుగా పేర్కొంటున్నారు.

ఓవర్సీస్‌లో వసూళ్లు ఎంతంటే?
హౌస్‌ఫుల్ 5 సినిమా ఓవర్సీస్‌లోను భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 4 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో చాలా స్గ్రాంగ్‌గా ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్‌లో 50 మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు.

హౌస్‌ఫుల్ 5 మూవీ సినిమా వరల్డ్ వైడ్‌గా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ సినిమా 100 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 35 కోట్ల రూపాయలు రాబట్టింది.ఈ చిత్రం 4వ రోజు 10 నుంచి 12 కోట్లు ఇండియాలో, మరో రెండు కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ మొత్తంగా నాలుగు రోజుల్లో 110 నుంచి 115 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X