Housefull 5 Day 5 Box Office: 200 కోట్లకు చేరువగా హౌస్‌ఫుల్ 5.. రివ్యూలకు షాకిచ్చిన అక్షయ్ కుమార్ మూవీ

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం హౌస్‌ఫుల్ 5. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన 5వ చిత్రానికి తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్, అలాగే గత 5 రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హౌస్‌ఫుల్ 5 మూవీకి రెండు క్లైమాక్స్‌
హస్‌ఫుల్ 5 సినిమా విశేషాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకైనా ఒకే ఒక క్లైమాక్స్ ఉంటుంది. అన్ని సినిమాలకు భిన్నంగా ఈ మూవీకి రెండు క్లైమాక్స్‌లను షూట్ చేశారు. ఈ రెండు క్లైమాక్సులను కూడా ఒకే సమయంలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండు క్లైమాక్స్‌లు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తిని పెంచారు. అయితే హౌస్‌ఫుల్ 5 సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉండటంతో హౌస్‌ఫుల్ 5 A, హౌస్‌ఫుల్ 5 B అనే టైటిల్స్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

Housefull 5 Day 5 Expected

బడ్జెట్ ఎంతంటే?
కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, జాక్వలైన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, చంకీ పాండే, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, డినో మారియా, జానీ లీవర్,చిత్రంగద సింగ్ తదితరులు నటించారు. దాదాపు 19 మంది స్టార్ యాక్టర్లు ఇందులో భాగమయ్యారు. అలాగే యోయో హానిసింగ్ లాంటి టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు మకావులో జరిగింది. ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

5 రోజుల్లో ఇండియా కలెక్షన్లు
హౌస్‌ఫుల్ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు పరంగా రికార్డులు సృష్టిస్తున్నది. ఈ సినిమా ఇండియాలో తొలి రోజు 24 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, మూడో రోజు 33 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 13 కోట్ల రూపాయలు, ఐదో రోజు 10 నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదు రోజుల్లో ఈ సినిమా సుమారుగా 110 కోట్ల నుంచి 115 కోట్ల మధ్య వసూళ్లు రాబడుతుంది అని పేర్కొన్నారు.

ఓవర్సీస్ బాక్సాఫీస్ రిపోర్ట్
ఒక ఓవర్సీస్‌లో హౌస్‌ఫుల్ 5 సినిమాకు భారీ ఆదరణ లభిస్తున్నది. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో విశేషంగా కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా గత 5 రోజుల్లో సుమారుగా 5 మిలియన్ డాలర్ల అంటే 43 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే వరకు 8 మిలియన్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
వరల్డ్ వైడ్‌గా అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా దూసుకెళ్తున్నది. ట్రేడ్ పండితులు, మూవీ క్రిటిక్స్ అంచనాలకు అందనంత వేగంగా ఈ సినిమా సరికొత్త మైలురాళ్లను దాటేస్తున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 155 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా త్వరలోనే 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X