Housefull 5 Day 6 Box Office: హౌజ్ ఫుల్ 6వ రోజు వసూళ్లు.. మిక్డ్స్ టాక్ తోనూ దుమ్ములేపుతున్న అక్షయ్ కుమార్..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన తాజా చిత్రంతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'హౌస్ ఫుల్ 5'. ఈ చిత్రానికి తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించారు. నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా, వర్దా నడియాడ్‌వాలా, ఫిరుజీ ఖాన్ లు సంయుక్తంగా నిర్మించారు. జూన్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత?, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 6 రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్ ఎంతంటే?
ఈ చిత్రంలో భారీ తారాగణం నటించింది. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ పోషించారు. బాలీవుడ్ స్టార్స్ రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ కీలక పాత్రలు పోషించారు. యోయో హానిసింగ్ సంగీతం అందించారు. ఇలా టాప్ యాక్టర్స్ నటించడం, అలాగే టాప్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి పనిచేయడంతో మేకర్స్ కు భారీగానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రమోనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ.225 కోట్లు ఖర్చైందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్..
అక్షయ కుమార్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉండటంతో ఈ చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాగా ఈ చిత్రానికి రూ.240 కోట్లుగా బ్రేక్ ఈవెన్ వాల్యూ లెక్క గట్టారు ట్రేడ్ పండితులు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు రికవరీ అయ్యింది. ఇంకా థియేట్రికల్ రన్ ద్వారా రూ.105 కోట్లు రాబట్టాల్సి ఉంది. కానీ ఈ చిత్రం 325 కోట్లు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తేనే హిట్ గా పరిగణించబడుతుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
5 రోజుల ఇండియా కలెక్షన్లు..
మిక్స్‌డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అదిరిపోతున్నాయి. ఇండియాలో తొలి రోజు రూ.24 కోట్లు, 2వ రోజు రూ.31 కోట్లు, 3వ రోజు రూ.33 కోట్లు, 4వ రోజు రూ.13 కోట్లు, 5వ రోజు 11.25 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఇక 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.175 కోట్లు గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణంకాలు తెలుపుతున్నాయి. మొత్తం ఇండియా నెట్ రూ.111.75, ఇండియా గ్రాస్ రూ.134 కోట్ల వరకు 5 రోజుల్లో కలెక్ట్ చేసింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ రిపోర్ట్..
హౌస్‌ఫుల్ 5 సినిమాకు ఒక ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అదిరిపోతున్నాయి. 5 రోజుల్లో ఈ చిత్రానికి 41 కోట్లు వసూల్ అయ్యిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. మొదటి వారం పూర్తయ్యే సరికి ఓవర్సీస్ లో రూ.50 కోట్లు వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 6వ రోజు కూడా భారీగానే వసూళ్లు అందాయి. బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ ఇండియా నెట్ రూ.8 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిల్క్ తెలిపింది. ఇండియా గ్రాస్ రూ.16 కోట్లు కలెక్ట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని రూ.175 కోట్లు వసూలైందని సాక్ నిల్క్ లెక్కలు తెలుపుతున్నాయి. ఇక మొదటి వారంలోనే చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ చేస్తుందని తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











