Housefull 5 Day 7 Box Office: హౌజ్ ఫుల్ 5 భారీ కలెక్షన్లు.. వారం రోజుల్లో అక్షయ్ కుమార్ కు ఎన్ని కోట్ల లాభమంటే
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దుమ్ములేపుతున్నారు. తను నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'హౌస్ ఫుల్ 5'తో మంచి వసూళ్లను రాబడుతున్నాడు. తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను పొందుతోంది. జూన్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ డే మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం దూకుడుగానే ఉంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్ ఎంత?, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?, 7 రోజులుగా బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్ జరిగింది, ఎంత లాభం వచ్చిందనేది వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 మూవీ బడ్జెట్?
అక్షయ్ కుమార్ లీడ్ రోల్ నటించిన ఈ చిత్రంలో భారీ తారాగణం నటించింది. బాలీవుడ్ స్టార్స్ రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ కీలక పాత్రల్లో నటించారు. యోయో హానీసింగ్ మ్యూజిక్ అందించారు. భారీ తారాగణం, టాప్ లెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేయడంతో భారీగానే ఖర్చు అయ్యింది. ప్రమోనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా రూ.225 కోట్లు అయ్యింది.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ తో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.240 కోట్లు బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ట్రేడ్ వర్గాలు నిర్ణయించాయి. కాగా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వచ్చింది. ఇంకా థియేట్రికల్ రన్ ద్వారా రూ.105 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే ఆ మార్క్ ను ఎప్పుడో దాటేసింది. కానీ ఈ చిత్రం 325 కోట్లు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేస్తేనే హిట్ గా పరిగణించబడుతుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.
6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..
మిక్స్‌డ్ టాక్ తోనూ అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 5 చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్లు వసూళ్లైంది. 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.187.25 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.ఇప్పటి వరకు ఇండియా నెట్ మొత్తం రూ.120.25 కోట్లకు, ఇండియా గ్రాస్ రూ.144.25 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ గణాంకాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
హౌస్‌ఫుల్ 5 సినిమా ఓవర్సీస్‌లో జోరుగా వసూళ్లు రాబడుతోంది.నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోతున్నాయి. మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2 కోట్లు వసూళ్లు చేసింది.ఇక 6 రోజుల్లోనే రూ.43 కోట్లు వసూళ్ల రాబట్టిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
7వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి 7వ రోజు భారీగానే వసూళ్లు అందాయి. ఇండియా నెట్ రూ.6.75 కోట్లు వసూల్ చేసింది. దీంతో 7 రోజుల్లో ఇండియా నెట్ మొత్తంగా రూ.127 కోట్లకు చేరుకుందని సాక్ నిల్క్ లెక్కలు చెబుతున్నాయి. ఇక రూ.13 కోట్ల వరకు ఇండియా గ్రాస్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో 7 రోజుల్లో ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.203 కోట్ల వరకు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ వసూళ్లతో హౌజ్ ఫుల్ 5 చిత్రం లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. 240 కోట్లు రికవరీ సాధించగా.. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.135 కోట్ల అందుకుంది. దీంతో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.105 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ లెక్కన మాత్రం అన్ని ఖర్చులు పోను ఈ చిత్రం ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా లాభాన్ని అందుకుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











