Housefull 5 Day 9 Box Office: హౌజ్ ఫుల్ 5 9వ రోజు వసూళ్లు.. అక్షయ్ కుమార్ దే హవా.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే?

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ దుమ్ము లేపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిల్మ్ 'హౌజ్ ఫుల్ 5'. తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి 2వ వారంలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీగానే వసూళ్లను అందుకుంటోంది. జూన్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం రోజుకు రూ.6 కోట్లకు తగ్గకుండానే వసూళ్లను రాబడుతోంది. మిక్డ్స్ టాక్ తోనే ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 9వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..

హౌజ్ ఫుల్ 5 బడ్జెట్?
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి భారీగానే ఖర్చైంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తోపాటు భారీ తారాగణం నటించింది. నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రం కోసం పని చేశారు. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చు, ప్రమోనల్ వ్యయంతో కలిపి మొత్తంగా రూ.225 కోట్లు అయ్యింది.

Housefull 5 Day 9 Box Office Collections Worldwide

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్?
ఈ చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. కాగా రూ.240 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ వాల్యూను లెక్క గట్టారు ట్రేడ్ నిపుణులు. అలాగే ఈ చిత్రానికి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వచ్చింది. థియేట్రికల్ రన్ ద్వారా ఇప్పటికే రూ.210 కోట్లకు పైనే వసూల్ చేసింది.

8 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..
మొదటి రోజు నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్లు, 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. 8వ రోజు రూ.12 కోట్లు వసూల్ అయ్యింది. ఇలా 8వ రోజు వరకు ఇండియా నెట్ రూ.133.25 కోట్లకు చేరుకుంది.

ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్‌లో హౌస్‌ఫుల్ 5 జోరుగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో భారీగానే బాక్సాఫీస్ కలెక్షన్లు అందుతున్నాయి. ఇక మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు రూ.50 లక్షలు, 8వ రోజు రూ.4.50 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా 8 రోజుల్లో రూ.48 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.

9వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి 9వ రోజు వీకెండ్ కావడంతో భారీగా వసూళ్లు దక్కాయి.9వ రోజు ఇండియా నెట్ రూ.9 కోట్ల వరకు వసూలైందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 9వ రోజు వరకు ఇండియా గ్రాస్ రూ.18 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా 9 రోజుల్లో ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.220 కోట్ల వరకు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల లాభం అందుకుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X