Kalki 2898 AD: 12 సెకన్ల కోసం 3 కోట్లు.. కల్కి ప్రమోషన్స్ కు మంచి నీళ్లలా ఖర్చు.. బడ్జెట్ ఎంతో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' సినిమాపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు చాలా మంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే కల్కి ప్రచార కార్యక్రమాల కోసం మేకర్స్ డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఆ బడ్జెట్ తో ఓ భారీ మూవీని తీసేవచ్చు. మరి కల్కి మూవీ ప్రమోషన్స్ కు పెట్టే బడ్జెట్ ఎంత అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ నటించిన చిత్రం 'కల్కి 2898 AD'సైన్స్ ఫిక్షన్ స్టైల్లో రూపొందుతోంది. ఈ సినిమా కథ మహాభారతం నుండి మొదలవుతుంది. ఇందులో 6000 వేల సంవత్సరాల కథ ఉంటుంది. జూన్ 27న 'కల్కి 2898 ఏడీ' సినిమా విడుదల కానుంది.

How much kalki 2898 AD producer spending Budget for Prabhas movie promotion Can you Guess

'కల్కి 2898 ఏడీ'సినిమా బడ్జెట్ దాదాపు 600 కోట్ల రూపాయలని చిత్ర బృందం పేర్కొంది. అదేవిధంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్రబృందం భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు రావాలి అంటే వసూళ్లు 1000 కోట్ల రూపాయలు దాటాలి. వెయ్యి కోట్ల కలెక్షన్స్ దాటితేనే నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకోగలరు.

అయితే ఆ రేంజ్ లో వసూళ్లు ఆవలి అంటే సినిమా మరింత మందికి చేరువ కావాలి. కాబట్టి నిర్మాతలు పబ్లిసిటీ, ప్రమోషన్ కోసం ఊహించనంత డబ్బు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోషన్‌కు భారీ బడ్జెట్‌ ను కేటాయిస్తున్నారు.దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలకు ఎంత భారీ బడ్జెట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన పర్ఫెక్ట్ మేకింగ్ తో పాటు పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఇప్పుడు అదే టెక్నిక్‌ని 'కల్కి 2898 AD' బృందం ఫాలో అవుతోంది.

రీసెంట్‌గా ఐపీఎల్‌లో ప్రభాస్ కల్కి అవతార్‌లో వచ్చి సినిమాను ప్రమోట్ చేశాడు. ఇది 12 సెకన్ల యాడ్. దీని కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మేకర్స్. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. అంతే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రమోషన్ జరగనుంది. వచ్చే ప్రముఖులకు బస ఏర్పాట్లు నిర్మాతలు చేస్తారు.

How much kalki 2898 AD producer spending Budget for Prabhas movie promotion Can you Guess

ప్రస్తుతం విన్పిస్తున్న టాక్ ప్రకారం 'కల్కి 2898 AD' ప్రమోషనల్ కార్యక్రమాలకే ఏకంగా 40 నుంచి 60 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఇంత డబ్బుతో ఓ భారీ బడ్జెట్ సినిమానే తీయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచేశారు మేకర్స్. ఓవైపు ప్రీ రీలీజ్ ఈవెంట్ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు స్పెషల్ వీడియోలు రిలీజ్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా రీలీజ్ చేసిన బుజ్జి మేకింగ్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. భైరవ కారు బుజ్జీకి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X