Remuneration: తండేల్‌కు భారీ రెమ్యునరేషన్లు.. సాయి పల్లవి, నాగ చైతన్య ఎన్ని కోట్ల పారితోషికమంటే?
ఈ ఏడాదిలో తెలుగు సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన పాన్ ఇండియా సినిమా "గేమ్ ఛేంజర్". గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి వస్తున్నా తదుపరి చిత్రమే "తండేల్".
యువ హీరో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి కాంబినేషన్ లో కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమానే ఇది. కాగా ఈ సినిమాతో హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో థియేట్రికల్ గా నాగ చైతన్యకి సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది.

బంగార్రాజు సినిమా తర్వాత చైతు చేసిన అన్ని సినిమాలు అయితే ప్లాప్ లేదా డిజాస్టర్ గానే నిలిచాయి. కాగా ఈ తర్వాత వచ్చిన వెబ్ సిరీస్ దూత తో మంచి హిట్ అందుకోగా ఆ సిరీస్ హిట్ తర్వాత వస్తున్న సినిమానే "తండేల్". మరి దూత ఇచ్చిన బూస్టప్ తో తండేల్ కి మంచి బజ్ వచ్చింది. అక్కడ నుంచి కొనసాగుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతుంది.
కాగా అన్ని ప్లాప్ లు పడినప్పటికీ తండేల్ కి అక్కినేని హీరో భారీ రెమ్యునరేషన్ నే అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క నాగ చైతన్య మాత్రమే కాకుండా హీరోయిన్ సాయి పల్లవి కూడా గట్టి మొత్తమే అందుకుందట. మరి పలు రిపోర్ట్స్ ప్రకారం తండేల్ కి నాగ చైతన్య 15 కోట్లు రెమ్యునరేషన్ గా ఛార్జ్ చేస్తే సాయి పల్లవి మాత్రం 5 కోట్లు అందుకుంది అని తెలుస్తుంది.

దీనితో వీరి కెరీర్ లోనే ఇవి అత్యధికం అన్నట్టుగా కూడా టాక్. మరి చూడాలి "తండేల్" లో వారు తీసుకున్న దానికి న్యాయం చేసారా లేదా అనేది. ఇక ఈ సినిమాకి ఏకంగా 90 కోట్లకి పైగానే బడ్జెట్ అయ్యిందట. ఇది కూడా నాగ చైతన్య కెరీర్లోనే అత్యధికం అనే అంటున్నారు. సో బాక్సాఫీస్ టార్గెట్ కూడా ఎక్కువే ఈ అన్నిటిని తండేల్ అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ ఫిబ్రవరి 7 వరకు ఆగక తప్పదు. ప్రస్తుతం సాయి పల్లవి వరుస హిట్స్ లో ఉంది.
తాను నటించిన అమరన్ సినిమా గత ఏడాది 300 కోట్లకి పైగా రాబట్టింది. సో చాలా మంది సాయి పల్లవి సెంటిమెంట్ పై కూడా అసలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాని మేకర్స్ తెలుగు సహా హిందీ మరియు తమిళ భాషల్లో ఈ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


Click it and Unblock the Notifications











