3000 కోట్ల కలెక్షన్లు.. 11 రోజుల్లోనే బాక్సాఫీస్‌ను రఫాడించిన లైవ్ యాక్షన్ మూవీ!
హాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు డ్రీమ్ వర్క్స్ యానిమేషన్, మార్క్ ప్లాట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన అమెరికా ఫాంటసీ చిత్రం హౌ టూ ట్రైన్ యూవర్ డ్రాగన్ (How to Train Your Dragon). డీన్ డెబ్లోయిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మార్క్ ప్లాట్, ఆడమ్ సీగెల్ నిర్మించారు. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ మాసన్ థామెస్, నికో పార్కర్, గ్యాబ్రియేల్ హౌవెల్, జూలియన్ డెన్నిసన్ తదితరులు నటించారు. జూన్ 13 తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు లెవెల్ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? గత 11 రోజుల్లో వసూలైన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమాను 2010లో ఇదే టైటిల్‌తో రూపొందిన యానిమేషన్ సినిమాకు రీమేక్. లైవ్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా భారీ వ్యయంతో రూపొందించారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులు పారితోషికం, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 150 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1290 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో అధునిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఓవర్సీస్‌లను, హాలీవుడ్‌లోను మంచి స్పందనను కూడగట్టుకొన్నది. ఈ చిత్రం ఇండియాలో అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం భారత్‌లో 21 కోట్ల రూపాయల నెట్, 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాపై మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చేసేందుకు అనాసక్తిని చూపారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇక హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ సినిమా నార్త్ అమెరికాలో అంటే కెనడా, యూఎస్ఏలో ఘనంగా వసూళ్లను రాబట్టింది. కేవలం తొలి వారాంతంలోనే ఈ సినిమా 85 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా గత 11 రోజుల్లో నార్త్ అమెరికాలో 161 మిలియన్ డాలర్లు అంటే 1385 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఇంకా ఈ సినిమా అమెరికన్ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గానే ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికాన్ బాక్సాఫీస్ వద్ద నెంబర్ 1 చిత్రంగా టాప్ రేంజ్‌లో వసూళ్లు రాబడుతున్నది. అమెరికాలో రెండు సినిమాలు కొత్తగా రిలీజ్ అయినప్పటికీ.. ఈ చిత్రం వాటి పోటీ తట్టుకొని భారీగా కలెక్షన్లు రాబట్టడం విశేషంగా మారింది.
ఇదిలా ఉండగా, అమెరికేతర దేశాల్లో హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ చిత్రం తన సత్తాను చాటింది. ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో 200 మిలియన్ డాలర్లు 1721 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 360 మిలియన్ డాలర్లు అంటే.. 3000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇటీవల కాలంలో ఓ హాలీవుడ్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధించడంపై ట్రేడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











