రూ.1710 కోట్లు.. 4 రోజుల్లోనే హాలీవుడ్ చిత్రం సంచలనం.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon ) హాలీవుడ్ చిత్రం దుమ్ములేపుతోంది. జూన్ 13న విడుదలైన ఈ చిత్రం కేవలం 4 రోజుల్లో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రూ.1700 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఇండియాలో ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలవ్వడం విశేషం. ఈ క్రమంలో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ చిత్రం బడ్జెట్ ఎంత? నటీనటులు, టెక్నీషియన్లు, లేటెస్ట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ నటీనటులు, టెక్నీషియన్లు
2010లో వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ 'డ్రాగన్'కు రీమేక్ గా షార్ట్ టు షార్ట్ లైవ్ యాక్షన్ పద్ధతితో 'హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్' అనే చిత్రాన్ని నిర్మించారు. అలాగే 2003లో పబ్లిష్ అయిన పిల్లల పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ అమెరియన్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ కు డీన్ డెబ్లోయిస్ దర్శకత్వం వహించారు. మాసన్ థేమ్స్, నికో పార్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. బిల్ పాప్ సినిమాటోగ్రఫీ అందించారు. వైట్ స్మిత్ ఎడిటింగ్ బాధ్యతలు చూశారు. జాన్ పావెల్ సంగీతం అందించారు.

హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ బడ్జెట్?
భారీ యానిమేషన్లు, భారీ తారాగణం, అత్యాధునికి టెక్నాలజీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. దీంతో భారీగానే ఖర్చైంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వర్క్స్ యానిమేషన్, మార్క్ ప్లాట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై 150 యూఎస్ఏ మిలియన్ డాలర్లతో నిర్మించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ చిత్రానికి రూ.1290 కోట్లు వెచ్చించారు. మార్క్ ప్లాట్, ఆడమ్ సీగెల్ నిర్మాతలుగా వ్యవహరించారు.
హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ వరల్డ్ వైడ్ కలెక్షన్లు
హాలీవుడ్ చిత్రాలకు సాధారణంగానే ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ఉంటుంది. అందులోనూ యాక్షన్ ఫిల్మ్స్ కు ఏ రేంజ్ స్పందన ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. కేవలం 4 రోజుల్లోనే హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ చిత్రం ఓవర్సీస్ లో రూ.985 కోట్లు వసూళ్లు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1710 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ అందించింది. ఇక ఇప్పటికే ఈ చిత్రం లాభాల్లోకి వచ్చేసింది. రూ.420 కోట్ల లాభాన్ని అందుకుంది.
ఇండియాలో హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ మూవీ వసూళ్లు..
హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ చిత్రం ఇండియాలోనూ మంచి వసూళ్లనే సాధిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ.11.73 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 13న మొదటి రోజే ఇండియాలో రూ.2.15 కోట్ల నెట్, 2వ రోజు రూ.4 కోట్ల నెట్, 3వ రోజు రూ.4.5 కోట్ల నెట్, 4వ రోజు రూ.1.40 కోట్ల నెట్ వసూళ్ల అందుకుంది. దీంతో ఇండియా నెట్ రూ.12.05 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.12.75 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











