Hridayapoorvam Day 4 Collections: దుమ్ములేపుతున్న హృదయపూర్వం.. మోహన్ లాల్ మూవీకి 4వ రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళ చిత్ర పరిశ్రమ అగ్ర హీరోగా మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హృదయపూర్వం. ఇప్పటికే మోహన్ లాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. భారీ చిత్రాలతో పాటు చిన్న బడ్జెట్ చిత్రాల్లోనూ నటిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఈ క్రమంలో హృదయపూర్వం చిత్రంతో ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదలై ఆకట్టుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లు? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? 4వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

హృదయపూర్వం బడ్జెట్?
ఈ ఫ్యామిలీ డ్రామాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. మోహన్‌లాల్, యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్, సంగీత మాధవన్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీత్ ప్రతాప్, సిద్ధిక్, లాలూ అలెక్స్, జనార్దనన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించడం విశేషం. సీనియర్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని సినిమాకు రూ.30 కోట్ల బడ్జెట్ అయ్యింది ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Hridayapoorvam Day 4 Box Office Collections Worldwide

బ్రేక్ ఈవెన్ పాయింట్?
మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్, మరోవైపు మలయాళం చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించడంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో కేరళలో పాటు మిగితా స్టేట్స్ లోనూ రూ.25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు నటించాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.

హృదయపూర్వం 4 రోజుల వసూళ్లు?
ఓపెనింగ్ డే రూ.3.8 కోట్ల ఇండియా నెట్, 2వ రోజు రూ.2.5 కోట్లు, 3వ రోజు రూ.3 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది. ఇక 4వ రోజు ఆగస్టు 31న ఆదివారం కావడంతో సినిమాకు భారీగానే వసూళ్లు అందాయని తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ చిత్రం రూ.1.70 కోట్ల నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ తెలిపింది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోల వసూళ్లు కలుపుకొని ఈ చిత్రం ఇండియా వైడ్ గా రూ.4 కోట్లు నెట్ వసూల్ చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
హృదయపూర్వం చిత్రం కన్నడలో రూ.86 లక్షలు, తెలంగాణ+ఏపీలో రూ.10 లక్షలు, తమిళనాడులో రూ.49 లక్షలు, కేరళలో రూ.8.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.60 లక్షలు వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. 3 రోజుల్లో ఇండియా నెట్ రూ.8.75 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.10.20 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12.80 కోట్లు వసూల్ చేసిందని, వరల్డ్ వైడ్ గా రూ.23 కోట్ల గ్రాస్ వసూలైందని సాక్ నిక్ తెలుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X