War 2: రికార్డ్ స్క్రీన్స్‌లో వార్ 2 రిలీజ్.... హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌ల మూవీకి ఎన్ని థియేటర్స్ అంటే?
హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వార్ 2. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రీతం సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారాలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ప్రమోషనల్ కార్యక్రమాల్లో వార్ 2 దూకుడు
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్- హృతిక్ డ్యాన్స్ చేసిన వీడియోను రిలీజ్ చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 10న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంచనాలను మరింత పెంచేసింది. ఎన్టీఆర్, హృతిక్‌లు ఈ సినిమా గురించి ఓ రేజ్‌లో చెప్పడం.. చివరిలో ఎన్టీఆర్ నన్నెవరూ ఆపలేరంటూ చేసిన వ్యాఖ్యలతో ఎప్పుడెప్పుడు వార్ 2ను చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్‌లో వార్ 2 రచ్చ
అంచనాలకు తగిన విధంగానే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఓవర్సీస్‌లో ప్రత్యేకించి నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఇండియాలో వార్ 2 బుకింగ్స్ ఓపెన్ అయినట్లు హృతిక్ రోషన్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ సినిమాకు ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సాక్‌నిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల వరకు.. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 2.24 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. అయితే బ్లాక్ సీట్లతో కలిపి వసూళ్లు 7.6 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని సాక్‌నిక్ అభిప్రాయపడింది. బ్లాక్ సీట్లను సాధారణంగా థియేటర్లు స్పాట్ బుకింగ్, స్టూడియోలు, స్పెషల్ ఆఫర్లు, ఇన్ హౌస్ ప్రమోషన్‌లలో భాగంగా రిజర్వ్ చేసి ఉంచుతాయి.
థియేటర్స్ కోసం వార్ 2తో కూలీ పోటీ
వార్‌కు తొలిరోజున హిందీలో 9000 షోలు, తమిళంలో 100 షోలు, తెలుగులో 115 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ వసూళ్లు వచ్చాయి. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం అదే రోజున విడుదల కావడంతో థియేటర్స్ విషయంలో వార్ జరుగుతోంది. హిందీ సినిమా కావడంతో నార్త్‌లో కలిసొచ్చినప్పటికీ .. సౌత్‌లో వార్ 2 హిందీ వెర్షన్‌కు థియేటర్స్ దొరకడం కష్టంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరిలలో పరిమిత సంఖ్యలో థియేటర్స్ విడుదల అవుతాయని వార్తలు వస్తున్నాయి.
థియేటర్స్ బ్లాక్ చేసిన యశ్ రాజ్ ఫిల్మ్స్
సోషల్ మీడియా కథనాలను బట్టి వార్ 2 చిత్రం హిందీ వెర్షన్.. ఇండియాలో దాదాపు 5000 స్క్రీన్‌లలో విడుదల కానుందట. తెలుగు, తమిళ్ వెర్షన్‌లు, ఓవర్సీస్ థియేటర్స్ చూసుకుంటే ఈ సంఖ్య 7000 వరకు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ల కోసం జరుగుతున్న పోటీలో యష్ రాజ్ ఫిల్మ్స్ దేశవ్యాప్తంగా 90 శాతం సింగిల్ స్క్రీన్లను లాక్ చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కూలీకి కేవలం 10 శాతం థియేటర్స్ మాత్రమే ఉంటాయని భావిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో వార్ 2కి దాదాపు 80 నుంచి 85 శాతం స్క్రీన్లు దక్కుతాయని.. మిగిలిన 15 శాతం స్క్రీన్లను ఇతర సినిమాలు పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా నార్త్ మార్కెట్ మొత్తం వార్ 2 డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి రిలీజ్ నాటికి ఏమైనా చర్చలు జరిగి థియేటర్స్ పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











