twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరాపై వార్ కలెక్షన్ల యుద్ధం.. రూ.300 కోట్లవైపు పరుగు..

    |

    గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన మల్టీస్టారర్ చిత్రం వార్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తున్నది. కండలవీరులు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ చిత్రం కలెక్షన్ల దుమారం సృష్టిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాన్ని పక్కన పెట్టిసే వసూళ్ల అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. రెండో వారంలో కూడా కొత్త సినిమాల పోటీని ఎదుర్కొంటూ రూ.300 కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్తున్నది.

    తొలివారం తర్వాత కూడా వార్ చిత్రం దూకుడు అడ్డుపడలేదు. రెండో వారంలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దాంతో ఈ చిత్రం 10 రోజుల తర్వాత రూ.250 కోట్ల కలెక్షన్లకు చేరువైంది. తొమ్మిదో రోజున రూ.238 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం శనివారం రూ.9 కోట్లు సాధించినట్టు సమాచారం. ఇక ఈ వారాంతానికి మరో రూ.30 కోట్లు వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

    Hrithik Roshans war heading for Rs.300 crores

    ఇక వారం రోజుల్లో రూ.200 కోట్ల మార్కును దాటిన వార్ చిత్రం ఆ తర్వాత అదే జోష్‌ను కొనసాగించింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లు, హృతిక్, టైగర్ ష్రాఫ్ ఫెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. దాంతో ఈ వసూళ్ల సునామీ కొనసాగింది. ఈ ఏడాది కబీర్ సింగ్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వార్ నిలిచింది.

    కాగా, హిందీలో వార్ సినిమాతో పోటీ పడుతూ విడుదలైన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. వార్ కలెక్షన్లకు దీటుగా రాబట్టలేకపోయింది. ఇక దక్షిణాదిలో సైరా పోటీకి విడుదలైన వార్ చిత్రం భారీ వసూళ్లను సాధించడం గమనార్హం. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రంలో వాణీ కపూర్, అశుతోష్ రానా, సోని రజ్దాన్, అనుప్రియ గోయెంకా తదితరులు నటించారు.

    English summary
    Bollywood heroes Hrithik Roshan and Tiger Shroff is combined for a Multi starrer movie War. This movie War movie day 2 collections was at 74 crores above. This movie collected nearly Rs.250 crores collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X