twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100 కోట్లకు చేరువలో వార్.. రెండో రోజు దారుణంగా హృతిక్ సినిమా కలెక్షన్లు

    |

    బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరిద్దరు కలిసి తొలిసారి మల్టీస్టారర్ మూవీ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో తొలిరోజున రికార్డు ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే రెండో రోజు కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉండటంతో ట్రేడ్ అనలిస్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి.

    అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రంలో వాణికపూర్ మళ్లీ తెరపైన మళ్లీ తన అదృష్టాన్ని చూసుకొనేందుకు ప్రయత్నించింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజున అంటే బుధవారం రూ.51.50 కోట్లు వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలు సంబరాల్లో మునిగిపోయారు.

    Hrithik Roshans War movie day 2 collections

    అయితే గురువారం ఊహించని విధంగా 50 శాతం క్షీణతతో రూ.22.5 కోట్లు రాబట్టడం షాక్ గురిచేసింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.74 కోట్లు వసూలు చేయడం గమనార్హం. త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

    వార్ మూవీ తొలి రోజు రూ.53.35 కోట్లు వసూలు చేసింది. హిందీలో 51.60, తెలుగు, తమిళంలో రూ.1.75 కోట్లు వసూలు చేసింది. దాదాపు ఈ చిత్రం 4 వేల స్క్రీన్లలో విడుదలైంది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ చిత్రం తొలి రోజు ఎనిమిది రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్'గా, హృతిక్ , టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ ఆనంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా, హాలీడే రోజున అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన హిందీ చిత్రంగా, యష్ రాజ్ ఫిలింస్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా పలు రికార్డులను సొంతం చేసుకొన్నది.

    ఈ సినిమా విజయపథాన దూసుకెళ్తున్న నేపథ్యంలో హృతిక్ మాట్లాడుతూ.. మా హార్డ్ వర్క్‌కు దక్కిన అద్భుత ప్రతిఫలం. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు మేము రుణపడి ఉంటాం. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఓ ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రేక్షకాదరణ చూసి మేము ఆనందంలో మునిగిపోతున్నాం అని హృతిక్ పేర్కొన్నారు.

    English summary
    Bollywood heroes Hrithik Roshan and Tiger Shroff is combined for a Multi starrer movie War. This movie War movie day 2 collections was at 74 crores above.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X