Just In
- 21 min ago
Ala Vaikunthapurranuloo భారీ రేటుకు హక్కులు...చక్రం తిప్పిన థమన్!
- 54 min ago
ప్రభాస్ కోసం బరిలోకి శంకర్, దిల్ రాజు! దెబ్బకు రేంజ్ డబుల్..!!
- 1 hr ago
శ్వేతబసుకు మరో షాక్.. భర్తకు విడాకులు.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు
- 1 hr ago
RRRలో ఎన్టీఆర్ లుక్ లీక్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, పిక్స్
Don't Miss!
- News
పవన్ రెండు కాకుంటే మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు.. మీకెందుకు : జగన్ కు నటుడు నరేష్ చురకలు
- Lifestyle
కడుపు ఎడమ వైపు నొప్పికి గల కారణాలు ఏమిటి? అందుకు కారణాలేంటో తెలుసా?ఈ నొప్పి ప్రమాదకరమా?
- Sports
పాక్ క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇక జట్టులోకి తీసుకోకూడదంటూ కామెంట్లు!!
- Finance
హైదరాబాద్ ప్రయాణీకులకు శుభవార్త: మెట్రోలో G5 సేవలు.. కానీ!
- Technology
చైనా సంస్థలతో జట్టు కట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇంటెక్స్
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
100 కోట్లకు చేరువలో వార్.. రెండో రోజు దారుణంగా హృతిక్ సినిమా కలెక్షన్లు
బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరిద్దరు కలిసి తొలిసారి మల్టీస్టారర్ మూవీ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో తొలిరోజున రికార్డు ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే రెండో రోజు కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉండటంతో ట్రేడ్ అనలిస్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అక్టోబర్ 2వ తేదీన రిలీజైన ఈ చిత్రంలో వాణికపూర్ మళ్లీ తెరపైన మళ్లీ తన అదృష్టాన్ని చూసుకొనేందుకు ప్రయత్నించింది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజున అంటే బుధవారం రూ.51.50 కోట్లు వసూలు చేయడంతో ట్రేడ్ వర్గాలు సంబరాల్లో మునిగిపోయారు.

అయితే గురువారం ఊహించని విధంగా 50 శాతం క్షీణతతో రూ.22.5 కోట్లు రాబట్టడం షాక్ గురిచేసింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.74 కోట్లు వసూలు చేయడం గమనార్హం. త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.
వార్ మూవీ తొలి రోజు రూ.53.35 కోట్లు వసూలు చేసింది. హిందీలో 51.60, తెలుగు, తమిళంలో రూ.1.75 కోట్లు వసూలు చేసింది. దాదాపు ఈ చిత్రం 4 వేల స్క్రీన్లలో విడుదలైంది అని ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ చిత్రం తొలి రోజు ఎనిమిది రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్'గా, హృతిక్ , టైగర్ ష్రాఫ్, సిద్ధార్థ్ ఆనంద్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్గా, హాలీడే రోజున అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన హిందీ చిత్రంగా, యష్ రాజ్ ఫిలింస్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా పలు రికార్డులను సొంతం చేసుకొన్నది.
ఈ సినిమా విజయపథాన దూసుకెళ్తున్న నేపథ్యంలో హృతిక్ మాట్లాడుతూ.. మా హార్డ్ వర్క్‌కు దక్కిన అద్భుత ప్రతిఫలం. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు మేము రుణపడి ఉంటాం. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఓ ప్రయత్నం చేశాం. ఇప్పుడు ప్రేక్షకాదరణ చూసి మేము ఆనందంలో మునిగిపోతున్నాం అని హృతిక్ పేర్కొన్నారు.