Fighter 10 Days Collections: ఒక్కసారిగా వసూళ్లు డబుల్.. టోటల్‌గా వందల కోట్లు.. లాభం రావాలంటే మాత్రం!
విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన ప్రయోగాలు చేస్తూ దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. పేరుకు బాలీవుడ్ హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకున్నాడు.
దీంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇలా ఇటీవలే హృతిక్ 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోంది. అయితే, శనివారం కాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 10 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

ఫైటర్‌గా వచ్చేసిన హృతిక్: బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రమే 'ఫైటర్'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ చేశారు. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: భారీ హిట్ కోసం చూస్తున్న హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

పదో రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే కలయికలో రూపొందిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, ఆ తర్వాత మాత్రం పడిపోతూనే ఉంది. కానీ, ఈ శనివారం మళ్లీ పుంజుకుంది. ఫలితంగా 10వ రోజు 'ఫైటర్' చిత్రం రూ. 10.50 కోట్లు నెట్, రూ. 18 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

పది రోజులకు ఎంతంటే: హృతిక్ నటించిన 'ఫైటర్' మూవీకి తొలి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.75 కోట్లు, 10వ రోజు రూ. 10.50 కోట్లతో కలిపి.. మొత్తంగా రూ. 162.75 కోట్లు నెట్, రూ. 276 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు చాలా దేశాల్లో ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 10 రోజుల్లో ఓవర్సీస్‌లో 9.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 76.35 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 10 రోజుల్లో ఇది రూ. 162 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 38 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











