Fighter 12 Days Collections: కూలిపోయిన ఫైటర్.. అయినా వందల కోట్లతో రికార్డు.. కానీ హిట్ కావాలంటే!
సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్న హీరోనే హృతిక్ రోషన్. అలా దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఎన్నో సినిమాలతో సత్తా చాటిన అతడు.. కొద్ది రోజుల క్రితమే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోంది. అయితే, రెండో వీకెండ్‌లో పెరిగినా.. వర్కింగ్ డేలో కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 12 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

ఫైటర్‌గా హ్యాండ్సమ్ హంక్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'ఫైటర్'. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ చేశారు. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు ప్రొడ్యూస్ చేశారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: బిగ్ సక్సెస్ కోసం వేచి చూస్తున్న హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

12వ రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే జంటగా నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, ఆ తర్వాత వీక్ డేస్‌లో మాత్రం భారీగా పడిపోతూనే ఉంది. ఇలా ఈ సోమవారం కుప్పకూలింది. ఫలితంగా 12వ రోజు ఈ చిత్రం రూ. 3.35 కోట్లు నెట్, రూ. 5 కోట్లు గ్రాస్ రాబట్టింది.

12 రోజులకు ఎంతంటే: 'ఫైటర్'కు తొలి రోజు రూ. 22.50 కోట్లు, 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.75 కోట్లు, 10వ రోజు రూ. 10.50 కోట్లు, 11వ రోజు రూ. 12.50 కోట్లు, 12వ రోజు రూ. 3.35 కోట్లతో కలిపి.. రూ. 178.60 కోట్లు నెట్, రూ. 300.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: ఎన్నో దేశాల్లో హృతిక్ రోషన్‌కు ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 12 రోజుల్లో ఓవర్సీస్‌లో 10 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 83.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 12 రోజుల్లో ఇది రూ. 178 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 22 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











