Fighter 13 Days Collections: హృతిక్‌కు ఊహించని షాక్.. చిన్న మూవీ కంటే తక్కువగా.. అదే జరిగితే ఫ్లాపే!
ఇండియాలో ఇప్పుడు చాలా మందే సూపర్ స్టార్ హీరోలు ఉన్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ ఒకడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను మెప్పిస్తోన్న అతడు.. ఇటీవలే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.
దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోంది. అయితే, రెండో వీకెండ్‌లో పెరిగినా.. వర్కింగ్ డేస్‌లో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 13 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

ఫైటర్‌గా వచ్చేసిన హృతిక్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన చిత్రమే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ యాక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ చేశారు. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: భారీ విజయం కోసం చూస్తున్న హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

13వ రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే జోడీగా చేసిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, ఆ తర్వాత వీక్ డేస్‌లో మాత్రం భారీగా డౌన్ అవుతూనే వస్తోంది. ఇలా ఈ వారం మరింత పడిపోతోంది. ఫలితంగా 13వ రోజు ఈ చిత్రం రూ. 3.25 కోట్లు నెట్, రూ. 5.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

13 రోజులకు ఎంతంటే: 'ఫైటర్'కు తొలి రోజు రూ. 22.50 కోట్లు, 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.75 కోట్లు, 10వ రోజు రూ. 10.50 కోట్లు, 11వ రోజు రూ. 13.50 కోట్లు, 12వ రోజు రూ. 3.25 కోట్లు, 13వ రోజు రూ. 3.25 కోట్లతో కలిపి.. రూ. 181.75 కోట్లు నెట్, రూ. 306.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 13 రోజుల్లో ఓవర్సీస్‌లో 10.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 84.70 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 13 రోజుల్లో ఇది రూ. 181 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 19 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.


Click it and Unblock the Notifications











