Fighter 2 Weeks Collections: 200 కోట్లు రావాలి.. 2 వారాల్లో షాకింగ్‌గా.. హిట్ అవడానికి అదే మార్గం

గతంలో కంటే ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వరుసగా మూవీలు చేస్తూ ముందుకు వస్తున్నారు. అందులో హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఒకడు. ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ కొట్టాలన్న కసితో ఉన్న అతడు.. ఇటీవలే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు.

దీనికి ఆరంభంలో మంచి స్పందన వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోంది. అయితే, రెండో వారంలో అయితే చాలా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 14 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

ఫైటర్‌గా హృతిక్ అరాచకం: హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన చిత్రమే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ చేశారు. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు ప్రొడ్యూస్ చేశారు.

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

14వ రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే జంటగా నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో ఫస్ట్ వీకెండ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, రెండో వారంలో మాత్రం ఇది దారుణమైన పరిస్థితిని చూస్తూ.. మరింతగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా 14వ రోజు ఈ చిత్రం రూ. 2.75 కోట్లు నెట్, రూ. 4 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

14 రోజులకు ఎంతంటే: 'ఫైటర్'కు తొలి రోజు రూ. 22.50 కోట్లు, 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.75 కోట్లు, 10వ రోజు రూ. 10.50 కోట్లు, 11వ రోజు రూ. 14.50 కోట్లు, 12వ రోజు రూ. 3.25 కోట్లు, 13వ రోజు రూ. 3.25 కోట్లు, 14వ రోజు రూ. 2.75 కోట్లతో కలిపి.. రూ. 184.50 కోట్లు నెట్, రూ. 310 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: ప్రపంచ వ్యాప్తంగా హృతిక్ రోషన్‌కు ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 14 రోజుల్లో ఓవర్సీస్‌లో 10.3 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 85.49 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

Hrithik Roshan Starrer Fighter Movie 14 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రోజుల్లో ఇది రూ. 184 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 16 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X