Fighter 18 Days Collections: చరిత్ర సృష్టించిన హృతిక్.. టాప్ మూవీగా ఫైటర్.. ఫ్లాప్ టాక్‌తో హిట్ దిశగా!

బాలీవుడ్‌లోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్. సుదీర్ఘ కాలంగా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తోన్న అతడు.. ఇప్పుడు భారీ సక్సెస్‌ను సాధించాలన్న లక్ష్యంతో 'ఫైటర్' అనే మూవీని చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ, ఈ వీకెండ్ మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 18 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

ఫైటర్‌గా హృతిక్ వచ్చాడు:బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన చిత్రమే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. ఈ యాక్షన్ సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించారు.

Hrithik Roshan Starrer Fighter Movie 18 Days Worldwide Box Office Collections

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్:ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రూపొందిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.

18వ రోజు ఎన్ని కోట్లంటే:హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, రెండో వారంలో మాత్రం ఇది దారుణంగా డౌన్ అయింది. మూడో వారంలోనూ డౌన్ అవుతున్నా.. వీకెండ్‌లో పుంజుకుంది. ఫలితంగా 18వ రోజు ఈ చిత్రం రూ. 4 కోట్లు నెట్, రూ. 7 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Hrithik Roshan Starrer Fighter Movie 18 Days Worldwide Box Office Collections

18 రోజులకు ఎంతంటే:'ఫైటర్' సినిమాకు తొలి రోజు రూ. 22.50 కోట్లు, 2వ రోజు రూ. 39.50 కోట్లు, 3వ రోజు రూ. 27.50 కోట్లు, 4వ రోజు రూ. 29 కోట్లు, 5వ రోజు రూ. 8 కోట్లు, 6వ రోజు రూ. 7.50 కోట్లు, 7వ రోజు రూ 6.50 కోట్లు, 8వ రోజు రూ. 6 కోట్లు, 9వ రోజు రూ. 5.75 కోట్లు, 10వ రోజు రూ. 10.50 కోట్లు, 11వ రోజు రూ. 18.50 కోట్లు, 12వ రోజు రూ. 3.25 కోట్లు, 13వ రోజు రూ. 3.25 కోట్లు, 14వ రోజు రూ. 3 కోట్లు, 15వ రోజు రూ. 2.75 కోట్లు, 16వ రోజు రూ. 1.75 కోట్లు, 17వ రోజు రూ. 3.65 కోట్లు, 18వ రోజు రూ. 4 కోట్లతో కలిపి.. రూ. 196.90 కోట్లు నెట్, రూ. 332 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే:హృతిక్ రోషన్‌కు ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 18 రోజుల్లో ఓవర్సీస్‌లో 10.7 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 88.82 కోట్లు గ్రాస్‌ వసూలు అయింది.

Hrithik Roshan Starrer Fighter Movie 18 Days Worldwide Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 18 రోజుల్లో ఇది రూ. 196 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 4 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ స్టేటస్ చేరుతుంది.

అక్కడ టాప్ మూవీగా:హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం హిట్ స్టేటస్‌కు చేరువగా వచ్చింది. అదే సమయంలో నార్త్ అమెరికాలో ఇది 4.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా హృతిక్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టి 'ఫైటర్' టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X