Fighter 2 Days Collections: కుమ్మేసిన ఫైటర్.. ఫస్ట్ డే కంటే ఎక్కువగా.. మొత్తం ఎన్ని కోట్లో తెలిస్తే!
బడా ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చేసి తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్. గతంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో అతడు పెద్దగా హిట్లను అందుకోవడం లేదు.
అయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు హృతిక్ 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో వచ్చాడు. దీనికి మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ రాగా.. రెండో రోజు మాత్రం భారీ వసూళ్లను రాబట్టింది. మరి 'ఫైటర్' మూవీ రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే చూడండి!

ఫైటర్‌గా వచ్చేసిన హృతిక్: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా చేసిన చిత్రమే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ సంగీతం ఇచ్చారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.

రెండో రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ లభించింది. ఫలితంగా దీనికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నా.. ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఏవరేజ్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు మాత్రం రిపబ్లిక్ డే అడ్వాంటేజ్‌తో దీనికి రూ. 39 కోట్లు నెట్ వసూళ్లు, రూ. 55 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

రెండు రోజులకు ఎంతంటే: క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఫైటర్' మూవీకి రెండు రోజులకూ కలిపి భారీ వసూళ్లే వచ్చాయని చెప్పాలి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 39 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా రెండు రోజులకూ కలిపి రూ. 61.50 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే రూ. 90 కోట్లు గ్రాస్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారు. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం రెండు రోజుల్లో ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే రెండు రోజుల్లో వచ్చిన రూ. 90 కోట్లలో.. ఓవర్సీస్‌లోనే రూ. 17 కోట్లు వసూలు అయ్యాయి.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ నటించిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2 రోజుల్లో ఇది రూ. 61.50 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 138.50 కోట్లు నెట్‌ను రాబడితేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











