Fighter 22 Days Collections: నక్కతోక తొక్కిన హృతిక్.. వందల కోట్ల టార్గెట్ ఔట్.. తొలి సినిమాగా రికార్డు
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన మార్కును చూపిస్తూ.. స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో డిఫరెంట్ మూవీలతో వస్తున్నాడు.
అలా ఇటీవలే 'ఫైటర్' అనే మూవీని చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. అయినా తాజాగా టార్గెట్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 22 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో లుక్కేయండి!

ఫైటర్‌గా హృతిక్ ఎంటర్: బాలీవుడ్ బడా స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించిన చిత్రమే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తీసిన ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు. ఈ సినిమాను వయాకామ్ 22 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

22వ రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ - దీపికా పదుకొణే జంటగా నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ వీక్‌లో భారీ వసూళ్లు రాబట్టింది. అయితే, రెండో వారంలో మాత్రం ఇది దారుణంగా డౌన్ అయింది. ఆ తర్వాత కూడా ఇది క్రమంగా పడిపోతూనే వచ్చింది. ఫలితంగా 22వ రోజు ఈ చిత్రం రూ. 90 లక్షలు నెట్, రూ. 1.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

22 రోజులకు ఎంతంటే: సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'ఫైటర్' సినిమాకు మొదటి వారంలో రూ. 146.50 కోట్లు నెట్ వచ్చింది. అలాగే, రెండో వారంలో రూ. 41 కోట్లు, మూడో వారంలో రూ. 14.20 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక, 22వ రోజు ఈ సినిమా రూ. 90 లక్షలు నెట్ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ రూ. 201.70 కోట్లు నెట్‌తో పాటు రూ. 338 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు ఫాలోయింగ్, మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో విడుదల కాలేదు. ఫలితంగా ఈ చిత్రం 22 రోజుల్లో ఓవర్సీస్‌లో 11 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 91.33 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: యాక్షన్ జోనర్‌లో వచ్చిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 22 రోజుల్లో ఇది రూ. 201 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1 కోటికి పైగా లాభాలను ఇది సొంతం చేసుకుంది.
ఫ్లాప్ టాక్‌తో హిట్ మూవీగా: హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ చిత్రం మంచిగా రాణించింది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. తద్వారా హిందీలో ఈ ఏడాది విజయాన్ని అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











