Fighter 3 Days Collections: హృతిక్ మాస్ హిట్టింగ్.. 3 రోజుల్లోనే సెంచరీ దాటేసి.. ఇదేం కొట్టుడు సామీ!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సత్తా చాటుతూ స్టార్ హీరోగా దూసుకుపోతోన్నాడు హృతిక్ రోషన్. చాలా కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు.
ఇందుకోసం తాజాగా ఈ బడా హీరో 'ఫైటర్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. దీంతో వసూళ్లు భారీగా వస్తున్నాయి. మరి 'ఫైటర్' మూవీ 3 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

ఫైటర్‌గా ఎంటరైన హృతిక్: హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ సినిమానే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. ఈ చిత్రానికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసుకున్నారు.

మూడో రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ లభించింది. ఫలితంగా దీనికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నా.. ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఏవరేజ్ వసూళ్లు వచ్చాయి. రెండో రోజు భారీ వసూళ్లు లభించాయి. ఇక, మూడో రోజు ఈ చిత్రం రూ. 28 కోట్లు నెట్, రూ. 45 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

మూడు రోజులకు ఎంతంటే: పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఫైటర్' మూవీకి మూడు రోజులకూ కలిపి భారీ వసూళ్లే వచ్చాయని చెప్పాలి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 39.50 కోట్లు, మూడో రోజు రూ. 28 నెట్ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 3 రోజులకూ కలిపి రూ. 90 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే రూ. 140 కోట్లు గ్రాస్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు వరల్డ్ వైడ్‌గా ఎన్నో దేశాల్లో అభిమానులు ఉన్నారు. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం మూడు రోజుల్లో ఓవర్సీస్‌లో 3.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 26.59 కోట్లు వసూలు అయ్యాయి.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: బాలీవుడ్ బడా స్టార్ హృతిక్ నటించిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 రోజుల్లో ఇది రూ. 90 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 110 కోట్లు నెట్‌ను రాబడితేనే హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











