Fighter 4 Days Collections: ఫైటర్ సంచలనం.. 4 రోజుల్లో 1000000000 ఔట్.. అన్ని కోట్లతో హృతిక్ రికార్డు
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను ఫిదా చేసి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారిపోయాడు హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. అలా సుదీర్ఘ కాలంగా తన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు రేంజ్‌ను కూడా పెంచుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే హృతిక్ తాజాగా 'ఫైటర్' అనే సినిమాను చేశాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. దీంతో వసూళ్లు భారీగా లభిస్తున్నాయి. మరి 'ఫైటర్' మూవీ 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి!

ఫైటర్‌గా మారిపోయిన హీరో: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన యాక్షన్ సినిమానే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. ఈ చిత్రానికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలు చేశారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

నాలుగో రోజు ఎన్ని కోట్లంటే: సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంతా అనుకున్నారు. ఊహించని విధంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఏవరేజ్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత సత్తా చాటుతోంది. ఇలా 4వ రోజు ఈ చిత్రం రూ. 28.50 కోట్లు నెట్, రూ. 47 కోట్లు గ్రాస్ రాబట్టింది.

నాలుగు రోజులకు ఎంతంటే: 'ఫైటర్' మూవీకి నాలుగు రోజులకూ కలిపి భారీ వసూళ్లే వచ్చాయని చెప్పాలి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 39.50 కోట్లు, మూడో రోజు రూ. 27.50 కోట్లు, నాలుగో రోజు రూ. 28.50 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 4 రోజులకూ కలిపి రూ. 118 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే రూ. 187 కోట్లు గ్రాస్ కలెక్షన్లను కూడా సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఓవర్సీస్‌లో 4.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 37.41 కోట్లు వసూలు అయ్యాయి.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 4 రోజుల్లో ఇది రూ. 118 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 82 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

హృతిక్ ఏడో వంద కోట్లు: బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ చాలా కాలంగా భారీ హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందుకోసం 'ఫైటర్' మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం తాజాగా వంద కోట్ల నెట్ క్లబ్‌లో చేరింది. తద్వారా ఈ మార్క్ దాటిన హృతిక్ ఏడో సినిమాగా ఇది రికార్డు సాధించింది. అలాగే, దీపికా పదుకొణే 9వ వంద కోట్ల చిత్రంగా, సిద్దార్థ్ ఆనంద్ నాలుగో చిత్రంగా ఇది నిలిచింది.


Click it and Unblock the Notifications











