Fighter 5 Days Collections: ఒక్కసారిగా ఢమాల్.. 5 రోజుల్లో అన్ని వందల కోట్లు.. హృతిక్ హిట్ కొట్టాలంటే!
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ గాయ్ హృతిక్ రోషన్. చాలా కాలం పాటు వరుస హిట్లతో సత్తా చాటిన అతడు.. ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'ఫైటర్' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
దీనికి ఆరంభం నుంచే మంచి స్పందన అందుతోంది. ఫలితంగా మంచి వసూళ్లను రాబడుతోంది. అలాంటి తాజాగా ఈ చిత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'ఫైటర్' మూవీ 5 రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి!

మరో యాక్షన్ మూవీతో రాక: హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ నటించిన మరో యాక్షన్ మూవీనే 'ఫైటర్'. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకులు నిర్మించారు. దీనికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రను చేశారు.

హృతిక్ మూవీ ప్రీ బిజినెస్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ నెలకొంది. ఫలితంగా ఈ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4200లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా తీసుకు వచ్చారు.

ఐదో రోజు ఎన్ని కోట్లంటే: హృతిక్ రోషన్ హీరోగా.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన 'ఫైటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రావడంతో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత వీకెండ్‌లో ఈ సినిమా సత్తా చాటింది. ఇక, వర్కింగ్ డేలో మాత్రం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫలితంగా 5వ రోజు ఈ చిత్రం రూ. 8 కోట్లు నెట్, రూ. 13 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఐదు రోజులకు ఎంతంటే: 'ఫైటర్' మూవీకి ఐదు రోజులకూ కలిపి భారీ వసూళ్లే వచ్చాయని చెప్పాలి. మొదటి రోజు రూ. 22.50 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 39.50 కోట్లు, మూడో రోజు రూ. 27.50 కోట్లు, నాలుగో రోజు రూ. 29 కోట్లు, ఐదో రోజు రూ. 8 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఫలితంగా 5 రోజులకూ కలిపి రూ. 126.5 కోట్లు నెట్ రాబట్టింది. అలాగే రూ. 216 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఓవర్సీస్ వసూళ్లు ఎంతంటే: వాస్తవానికి హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మార్కెట్ ఉంది. అందుకే 'ఫైటర్' మూవీని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. కానీ, గల్ఫ్ దేశాల్లో ఈ చిత్రం అనివార్య కారణాలతో రిలీజ్ కాలేదు. ఫలితంగా ఈ చిత్రం ఐదు రోజుల్లో ఓవర్సీస్‌లో 6.6 మిలియన్ డాలర్లు రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ సినిమాకు రూ. 54.87 కోట్లు వసూలు అయ్యాయి.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: పూర్తి స్థాయి యాక్షన్‌తో రూపొందిన 'ఫైటర్' మూవీకి రూ. 200 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకు సమానంగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 200 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 5 రోజుల్లో ఇది రూ. 126 కోట్లు నెట్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇంకా రూ. 74 కోట్లు నెట్‌ను రాబడితేనే ఈ సినిమా హిట్ అవుతుంది.


Click it and Unblock the Notifications











